Sunday, December 22, 2024

కార్లు తరలిస్తున్న కంటైనర్‌లో మంటలు

- Advertisement -
- Advertisement -

కార్లు తరలిస్తున్న కంటైనర్‌లో మంటలు వ్యాపించి దాదాపు రూ.రెండు కోట్ల్ల విలువ చేసే 8 కార్లు దగ్ధమయ్యాయి. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబయి నుండి హైదరాబాద్ వైపు టాటా నెక్సాన్ కార్ల లోడుతో వెళుతున్న కంటైయినర్ వాహనంలో సాంకేతిక లోపం వల్ల మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రెండు కోట్ల రూపాయలు విలువ చేసే 8 కార్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న జహీరాబాద్ అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. కంటైనర్ వాహనంలో తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల అగ్నిప్రమాదం సంభవించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదం లో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News