Tuesday, December 24, 2024

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సజీవ దహనం

- Advertisement -
- Advertisement -

నార్సింగి: మెదక్ జిల్లా నార్సింగి మండలం కాస్లాపూర్ ఎన్‌హెచ్ -44 జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ లారీని వెనుక నుంచి మరొక కంటైనర్ లారీ ఢీకొనడంతో వెనుక ఉన్న లారీలో మంటలు చెలరేగి ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమైన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం… కర్ణాటకలోని బెంగళూరు నుంచి సామగ్రితో ఓ కంటైనర్ లారీ నాగపూర్ వైపు వెళ్తుంది. ఈ క్రమంలో నార్సింగ్ మండలం కాస్లాపూర్ వద్ద రోడ్డు పక్కనే టైరు పేలి ఆగి ఉన్న మరో కంటైనర్ లారీని ఢీకొట్టింది.

దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బెంగుళూరు నుంచి వస్తున్న లారీలోని నాగరాజు (25), బసవరాజు (24) సజీవదహనమయ్యారు. మృతులు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న రామాయంపేట అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అర్పివేశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్ట నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తూప్రాన్ సీఐ శ్రీధర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News