ఎన్నికల బాండ్ల వివరాల వెల్లడి జాప్యంపై దాఖలు చేసిన ఎడిఆర్
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు నగదుగా మార్చుకున్న ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించడానికి మరో నాలుగు నెలల వ్యవధి కావాలని భారతీయ స్టేట్ బ్యాంకు(ఎస్‌బిఐ) కోరడాన్ని వ్యతిరేకిస్తూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్(ఎడిఆర్) గురువారం సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట ఎడిఆర్ పిటిషన్ గురించి న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ప్రస్తావించగా పిటిషన్ దాఖలుకు సంబంధించిన ప్రక్రియ పూర్తయిన తర్వాత దీన్ని విచారణకు స్వీకరింంచే అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది.
రాజకీయ పార్టీలు నగదుగా మార్చుకున్న ఎన్నికల బాండ్ల కొనుగోలు దారులర్ల్రును వెల్లడించడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, తమకు గతంలో ఇచ్చిన గడువును జూన్ 30 వరకు పొడిగించాలని కోరుతూ ఎస్‌బిఐ గత సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాగా, గత నెలలో ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేసిన సుప్రీంకోర్టు మార్చి 6వ తేదీలోగా ఎన్నికల కమిషన్‌కు ఎన్నికల బాండ్లకు సంబంధించిన అన్ని వివరాలను సమర్పించాలని ఎస్‌బిఐని ఆదేశించింది. మా ర్చి 13వ తేదీ నాటికి ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీలకు అందిన అన్ని విరాళాల విరాళాలను బయటపెట్టాలని కోర్టు ఆదేశించింది. 15 రోజులపాటు చెల్లుబాటయ్యే ఎన్నికల బాండ్లను నగదు రూపంలో మార్చుకోని పక్షంలో వాటిని కొనుగోలుదారులకు వాపసు చేయాలని కూడా రాజకీయ పార్టీలను సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది.