అధిష్టానం ఆదేశిస్తే మల్కాజ్ గిరి నుంచి పోటీ చేస్తానని బిజెపి మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మనసులో మాట బయటపెట్టారు. యాదాద్రిలో ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభించింది. ప్రధాని మోడీ నాయకత్వలో దేశం పురోగతి సాధిస్తోందని ఈటల తెలిపారు. మోడీని ఆదరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ హామీలపై ప్రజలకు భ్రమంలు తొలగుతున్నాయన్నారు. ఉచిత బస్సు పథకంలో ప్రయాణికులు పెరిగినా.. బస్సులు పెరగలేదని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి మోడీని కలిసి మీకు దండం పెడతా అప్పు ఇవ్వమని అడుగుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు సార్లు ఢిల్లీకి పోయి మోడీని, అమిత్ షాను, ఆర్థిక శాఖ మంత్రిని కలిసి మీకు దండం పెడతాం అప్పులు ఇవ్వమని అడుగుతున్నారని ఈటెల తెలిపారు. రాష్ట్రం సమగ్ర అభివృద్ధి జరగాలంటే బిజెపిను గెలిపించాని ప్రజలకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ గెలిచినా లాభం లేదన్న ఈటల రాజేంద్ తమకు ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే అవసరం లేదని పేర్కన్నారు.