Thursday, January 23, 2025

స్పీకర్ పదవికి పోటీ తప్పదా?

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ స్పీకర్ ఎన్నిక కోసం వచ్చేవారం విపక్షాలు ఒత్తిడి చేస్తే ఎన్నికల నిర్వహణకు ప్రిసైడింగ్ అధికారిని ఏకాభిప్రాయం ద్వారా ఎంపిక చేయడం దేశ స్వాతంత్య్ర చరిత్రలో అది మొట్టమొదటి సంఘటన అవుతుంది. స్వాతంత్య్రం రాకముందు పార్లమెంట్‌కు స్పీకర్ పదవి కోసం మొట్టమొదటిసారి 1925 ఆగస్టు 24 న ఎన్నికలు జరిగాయి. స్వరాజ్య పార్టీ నియామక అభ్యర్థి విఠల్‌భాయి జె పాటిల్, ప్రత్యర్థి టి. రంగాచారియర్‌పై విజయం సాధించారు. అధికారేతర సభ్యునిగా పటేల్ స్పీకర్ పదవికి కేవలం రెండు ఓట్ల తేడాతో విజయం సాధించగలిగారు. పటేల్‌కు 58 ఓట్లు రాగా, రంగాచారియర్‌కు 56 ఓట్లు వచ్చాయి. స్వాతంత్య్రం రాక ముందు 19251946 మధ్య ఆరుసార్లు స్పీకర్ పదవికి ఎన్నికలు అవసరమయ్యాయి. చిట్టచివరిగా 1946లో ఎన్నికైన కాంగ్రెస్ నేత జివి మౌలాంకర్, ఆ తర్వాత తాత్కాలిక పార్లమెంట్‌కు కూడా స్పీకర్‌గా కొన్నాళ్లు కొనసాగారు.

అప్పటి నుంచి ఏకాభిప్రాయం తోనే స్పీకర్ ఎన్నిక పూర్తవుతూ వస్తోంది. ఎం.ఎ. అయ్యంగార్, జి.ఎస్. థిల్లాన్, బలరాం జక్కర్, జిఎంసి బాలయోగి వరుసగా రెండు విడతలు ఈ పదవికి ఎన్నికయ్యారు. కానీ ఈసారి స్పీకర్ పదవిపై వివిధ వర్గాల నుంచి డిమాండ్లు పెరిగాయి. విపక్ష కూటమి ‘ఇండియా’నే కాకుండా ఎన్‌డిఎ భాగస్వామ్య పార్టీల నుంచి కూడా ఒత్తిడి వస్తోంది. అయితే డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షనేతకు కేంద్రం అంగీకరించకపోతే తాము పోటీకి దిగుతామని విపక్షకూటమి నేత ఒకరు ప్రకటించారు. 18వ లోక్‌సభ సమావేశాలు జూన్ 24న ప్రారంభ మవుతాయి. లోక్‌సభ కొత్త సభ్యులు ప్రమాణం చేశాక స్పీకర్‌ను ఎన్నుకుంటారు. ఈ నేపథ్యంలో స్పీకర్ పదవి కోసం ఒత్తిడి తీసుకురావాలని ఎన్‌డిఎ భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీకి విపక్ష కూటమి సూచిస్తోంది. అలా చేయకుంటే క్రమంగా తెలుగు దేశం బలహీన పడుతుందని హెచ్చరిస్తోంది.

అయితే లోక్‌సభ స్పీకర్‌గా బిజెపి అభ్యర్థికి జెడి(యు) మద్దతు ప్రకటించింది. ఈ పదవికి ఏకాభిప్రాయం అవసరమని తెలుగుదేశం భావిస్తోంది. గత చరిత్ర పరిశీలిస్తే లోక్‌సభ స్పీకర్ పదవికి 1925 నుంచి 1946 మధ్యకాలంలో ఆరుసార్లు పోటీ తప్పలేదు. 1925 ఆగస్టు 24న అప్పటి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించారు. తర్వాత అదే పార్లమెంట్‌గా మారింది. ఆ ఎన్నికల్లో టి. రంగాచారియార్‌పై స్వరాజ్య పార్టీ అభ్యర్థి విఠల్‌భాయ్ జె. పటేల్ స్పీకర్‌గా నెగ్గారు. కేవలం రెండు ఓట్ల (5856) తేడాతో విజయం సాధించారు. స్పీకర్‌గా మొదటిసారి పదవీకాలం విజయవంతంగా పూర్తి చేసిన తరువాత పటేల్ రెండోసారి 1927 జనవరి 20న పటేల్ మళ్లీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహాత్మాగాంధీ శాసనోల్లంఘన ఉద్యమానికి పిలుపు ఇవ్వడంతో పటేల్ 1930 ఏప్రిల్ 28న స్పీకర్ పదవిని పరిత్యజించారు. 1930 జులై 9న సర్ మొహమ్మద్ యాకుబ్ స్పీకర్ పదవిలో మూడో పార్లమెంట్ సమావేశాల్లో పూర్తిగా కొనసాగారు.

నాల్గవ పార్లమెంట్ సమావేశాల్లో స్పీకర్‌గా సర్ ఇబ్రహిం రహింతుల్లా (76 ఓట్లు) హరిసింగ్ గౌర్ (36 ఓట్లు) పై విజయం సాధించారు. అయితే అనారోగ్య కారణాలపై రహింతుల్లా 1933 మార్చి 7న స్పీకర్ పదవికి రాజీనామా చేశారు.తరువాత షణ్ముఖం చెట్టి 1933 మార్చి 14న స్పీకర్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐదవ లోక్‌సభకు సర్ అబ్దుల్ రహీం స్పీకర్‌గా 1935 జనవరి 24న ఎన్నికయ్యారు.రహీం పదేళ్లకు పైగా స్పీకర్ పదవిలో రాణించారు. ఎప్పటికప్పుడు రాజ్యాంగం మార్పుల గురించి ఆలోచించడం, రెండో ప్రపంచ యుద్ధం కారణంగా పార్లమెంట్‌ను పదేళ్ల పాటు పొడిగించడమైంది. సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ పదవికి ఆఖరిపోటీ 1946 జనవరి 24న జరిగింది.అప్పుడు కాంగ్రెస్ నాయకుడు జివి మౌలాంకర్ ప్రత్యర్థి కౌవస్జీ జహంగీర్‌పై స్పీకర్‌గా విజయం సాధించారు.

1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన 1952 ఏప్రిల్ 17 వరకు తాత్కాలిక పార్లమెంట్ స్పీకర్‌గా మౌలాంకర్ కొనసాగారు. లోక్‌సభకు మొదటి డిప్యూటీ స్పీకర్ అయిన అయ్యంగార్, 1956లో మౌలాంకర్ మృతి తరువాత స్పీకర్‌గా ఎంపిక కాబడ్డారు. 1957లో సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత రెండో లోక్‌సభకు స్పీకర్‌గా ఎన్నికయ్యారు. 1969లో అప్పటి స్పీకర్ ఎన్. సంజీవరెడ్డి రాజీనామా చేయడంతో నాలుగో లోక్‌సభకు, అలాగే 1971లో ఐదో లోక్‌సభకు కూడా థిల్లాన్ స్పీకర్‌గా ఎన్నికయ్యారు.ఎమర్జెన్సీని బహిష్కరించిన వరకు 1975 డిసెంబర్ 1 దాకా స్పీకర్‌గా కొనసాగారు. ఏడు, ఎనిమిది లోక్‌సభలకు బలరాం జక్కర్ స్పీకర్‌గా కేవలం ప్రిసైడింగ్ అధికారిగానే పని చేశారు. 12 లోక్‌సభ స్పీకర్‌గా జిఎంసి బాలయోగి 19 నెలలు పని చేశారు. 13వ లోక్‌సభకు కూడా ఆయన 1999 అక్టోబర్ 22న నియామకమయ్యారు. 2002 మార్చి 3 న హెలికాప్టర్ ప్రమాదం జరిగిన వరకు స్పీకర్‌గా కొనసాగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News