Monday, December 23, 2024

గోవా సిఎం ప్రమోద్ సావంత్ నియోజకవర్గంలో పోటాపోటీ!

- Advertisement -
- Advertisement -

Goa election

పానాజీ: గోవాలో ఫిబ్రవరి 14న మొత్తం 40 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇక్కడ బిజెపి, కాంగ్రెస్,తృణమూల్ కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ పార్టీలు పోటీపడ్డాయి. పోటీ ప్రధానంగా బిజెపి, కాంగ్రెస్ మధ్యే ఎక్కువ ఉంది. మహారాష్ట్ర గోమంతక్ పార్టీ(ఎంజిపి) మద్దతుతో గోవాలో బిజెపి హ్యాట్రిక్ విజయం సాధించాలనుకుంటోంది. ఇదిలావుండగా గోవాలో ఎవరికీ ఆధిక్యత రాని పరిస్థితి(హంగ్) ఏర్పడనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ నియోజకవర్గంలో పోటీ పోటాపోటీగా ఉంది. ఏపార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజారిటీ, అంటే 21 సీట్ల మార్కు దక్కే సూచనలు కనపడ్డంలేదు. కాగా గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడంలో ఎంజిపి కీలక పాత్ర పోషించనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News