Wednesday, January 22, 2025

పాలేరు నుంచే పోటీ చేస్తా

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచే పోటీ చేయనున్నట్టు వైఎస్‌ఆర్‌తెంలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల వెల్లడించారు. పాలేరులో సోమవారం మేడే వేడుకల్లో పాల్గొన్నారు. తన పోటీపై ఎవరికీ ఎటువంటి అపోహలు అవసరం లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక సంక్షేమం కోసం పాటు పడాలన్నారు.

Also Read: నెలలో ఒక రోజు.. సుందర తిరుమల-శుద్ధ తిరుమల ఆచరిస్తాం

హక్కులకోసం పోరాడే కార్మికులను అణచివేయడం మంచిది కాదన్నారు. రాష్ట్రంలో అకాల వర్షాలు వడగండ్ల వానలకు పంటలు దెబ్బతిన్న ప్రాంతాలో పర్యటించి రైతులను పరామర్శించిన షర్మిల తన పర్యటనను ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్నారు. మంగళవారం మీడియా సమావేశంలో పార్టీ కార్యక్రమాలను వెల్లడించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News