Sunday, December 22, 2024

కెసిఆర్ పై పోటీ అంటే…పోశమ్మ గుడి ముందు పొట్టెలును కట్టేశినట్టే

- Advertisement -
- Advertisement -

గెలుపు మాట అటుంచితే ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా రావు

మన తెలంగాణ/ కామారెడ్డి ప్రతినిధి: సిఎం కెసిఆర్‌పై పో టీ అంటే పోశమ్మ గుడి ముందు పోట్టేలును కట్టేసినట్టేనని కెసిఆర్‌పై పోటీ చేసిన వారికి డిపాజిట్లు కూడా రావని ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. సిఎం కెసిఆర్ పోటీ చేయాలంటే అభ్యర్థుల వెన్ను ల్లో వణుకుపడుతుందని గెలుపు మాట అటుంచితే డిపాజి ట్ గల్లంతు ఖాయమన్నారు. కామారెడ్డి అభివృద్ధికి గ్రామగ్రామానికి ఒక మేనిఫెస్టోను ఏర్పాటు చేసి కామారెడ్డిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో 266 బూత్ కమిటీలు సమష్టిగా పనిచేసి కార్యకర్తలే కథానాయకులుగా కావాలని పిలునిచ్చారు. ఆయన శనివారం కామారెడ్డికి ప్రత్యేక హెలికాప్టర్‌లో చేరుకోగానే జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ప్రభు త్వ విప్ గంపగోవర్ధన్ స్వాగతం పలికారు. అనంతరం పట్టణంలో రూ. 8 కోట్ల వ్యయంతో నూతన హంగులతో నిర్మించనున్న ఇండోర్ స్టేడియానికి భూమి పూజ చేశారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బిఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగిచారు. సిఎం కెసిఆర్ కామారెడ్డిలో పోటీ చేయడం ఇక్కడి ప్రజల అదృష్టమని కామారెడ్డిలో కెసిఆర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించి పక్క ఉన్న మహారాష్ట్రకు మన సత్తా ఏంటో చూపించాలని కెటిఆర్ కోరారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రానున్న సాధారణ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవ ర్గం నుంచి పోటీ చేయనున్న నేపథ్యంలో కామారెడ్డికి కలిసొచ్చిందని దీంతో అందరి దృష్టి కామారెడ్డిపైనే ఉందని, ప్రజలు ఇచ్చే తీర్పుతో ప్రతిపక్ష పార్టీలకు దిమ్మతిరిగిపోతుందని కెటిఆర్ అన్నారు. బిఆర్‌ఎస్ అధినేత సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారంటే అందుకు బలమైన కారణం ఉంటుందన్నారు. జాతీయ పార్టీలకు బిఆర్‌ఎస్ పార్టీ తోక పార్టీ కాదని తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడే పార్టీ అని అన్నారు. ఢిల్ల్లీ, గుజరాత్ నేతలకు మనం గులాములం కావద్దని మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛ ఉండాలంటే బిఆర్‌ఎస్‌తోనే సా ధ్యమవుతుందని అన్నారు. నోటు ఓటు కేసులో ఇరుకు న్న కాంగ్రేస్ పార్టీ చీఫ్ రేవంత్‌రెడ్డి బిజెపికి తెరచాటు నుండి సహాయం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నుండి పది నుంచి ఇరువై స్థానాలు గెలుస్తే వారితో కలిసి బిజేపిలోకి జంప్ అయిపోవడం ఖాయమని జో ష్యం చెప్పారు. తలకు మించిన వాగ్దానాలతో నేడు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉక్కిరిబిరిక్కిరి అవుతున్నదని, అ యినప్పటికీ తెలంగాణ ఎన్నికల ఖర్చు కోసం అక్కడి ఉప ముఖ్యమంత్రి శివకుమార్ కమీషన్ల పేరుతో వసూ లు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ గ్యారంటీ ఆరు పథకాలంటూ ఊదరగొడుతున్నారని గతంలో ఏం చేశారో గుర్తు చేసుకోవాలన్నారు. కెసిఆర్‌పై పోటీ చేయడం కరెక్ట్ కాదని బిజెపి అభ్యర్థి ముందే ఒప్పుకున్నాడని అన్నారు. దక్షిణ భారత దేశంలో కెసిఆర్ గెలుపు చరిత్ర సృష్టించబోతున్నదని ఆయన తెలిపారు.

కామారెడ్డికి కెసిఆర్ అవినాభావ సంబంధం ఉందని గతంలో జరిగిన సంఘటనను గుర్తు చేశారు. మా నాయన్నమ్మ స్వగ్రా మం ప్రస్తుత బీబీపేట మండలంలోని పోసాన్‌పల్లి గ్రామమని అప్పర్ మానేరు నిర్మాణంతో తమ కుటుంబం చిం తమడకలో స్థిరపడ్డ విషయాన్ని గుర్తు చేశారు. అందుకే అక్కడ మా నానమ్మ పేరుమీద పాఠశాల నిర్మించామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు సమయంలో జలదృశ్యంలో జరిగిన కార్యక్రమాలకు స్థానిక అడ్వకేట్ తిర్మల్‌రెడ్డి నేతృత్వంలో కొందరు బిఆర్‌ఎస్‌కు మద్దతు పలికి తెలంగాణ ఉద్యమంలో కామారెడ్డిని ఉద్యమాల గడ్డగా మార్చారని, ఉద్యమంలో భాగంగా చేపట్టిన ప్రతి కార్యక్రమానికి కామారెడ్డి ప్రజలు అండగా నిలిచారని అన్నారు. కామారెడ్డిలో చేపట్టిన శ్రమదాన కార్యక్రమంలో కెసిఆర్ పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో జిల్లా పరిషత్ ఎన్నికల సమయం లో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జిల్లా పరిషత్‌పై గులాబీ జెండాను ఎగురవేసి ఘనత కామారెడ్డి ప్రజలకు దక్కుతుందన్నారు.

2004లో కాంగ్రెస్ తెలంగాణ ఏర్పాటుకు అనుకూలం గా ఉంటామని చేసిన ప్రకటనతో వారితో పొత్తుపెట్టుకున్నామని పొత్తు ధర్మంలో బాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన షబ్బీర్ అలీకి అవకాశం ఇవ్వడంతోనే ఆయన మం త్రి అయ్యాడని ఆ సమయంలో తన సీటుకోసం కేసీఆర్‌ను బతిమిలాడిన నేత నేడు గత విషయాలను మరిచి కెసిఆర్‌ను విమర్శించడం సిగ్గుచేటని అన్నారు. 2011 12 లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తున్న తరుణంలో టిడిపి నుంచి గెలుపొందిన గంపగోవర్దన్ తెలంగాణ కోసం రాజీనామా చేసి బిఆర్‌ఎస్‌తో భాగస్వామ్యం అయ్యారని ఆయన రాక ఉద్యమానికి మరింత ఉ త్సాహాన్ని నింపిందన్నారు. కొందరు పదువుల కోసం వెం పర్లాడే ప్రస్తుత తరుణంలో కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌ను పోటీ చేయాలని గంపగోవర్ధన్ తీసుకున్న నిర్ణ యం అభినందనీయమన్నారు. మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా ఏమి చేస్తారని తాను అడిగితే కార్యకర్తగా పని చేస్తానని గంపగొవర్ధన్ అది ఆయన గొప్పతనమని ఈ సందర్భంగా అభినందించారు. రాజకీయంగా కొన్ని సమస్యలుంటాయని బిఆర్‌ఎస్‌లో కులాలకు మతాలకు అతీతంగా అందరికి సమన్యాయం అందుతుందని అన్నారు.

ఎమ్మెల్యేగా అవకాశాలు రాని వారికి ఇతర పదవు ల్లో అవకాశం కల్పించి అందరిని కడుపులో దాచుకుంటామని అన్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యుహాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. వంద మంది ఓటర్లకు ఒక నాయకుడు ఇన్‌చార్జి చేసుకోవాలని చిన్నాపెద్ద నాయకులు కాకుండా అందరు సమానంగా పూర్తి స్థాయిలో పని చేయాలని ప్రతి గ్రామంలోని బిఆర్‌ఎస్ నాయకుల గ్రామాలలో మెజారిటీ వచ్చేందుకు పని చేయాలని సూచించారు. కామారెడ్డి నియోజకవర్గానికి తనతో పాటు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, గంపగోవర్దన్ నిరంతరం పర్యవేక్షణ కొనసాగు తుందని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి సంక్షేమ పథకాల ఫలాలను అనుభవిస్తున్న ప్రతి కుటుంబానికి కలిసి సిఎం కెసిఆర్ ఉత్తరాన్ని వారికి అందించి వారి ఆశీస్సులు తీసుకోవాలని సూచించారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా బీడీ కార్మికులకు పెన్షన్లు ఇక్కడ ఇస్తున్నామని అన్నారు. రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, షాదీముబారక్, కళ్యాణలక్ష్మీ, కెసిఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్లు, డబుల్ బెడ్‌రూంలు లబ్ధిదారులను పతి కార్యకర్త కలవాలని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో అమెరికాకు పారిపోయిన కిషన్‌రెడ్డి నోటుకు ఓటు కేసులో ఇరుక్కుపో యి ఉద్యమకారులపై గన్ను పట్టుకున్న రేవంత్‌రెడ్డిలు తెలంగాణ ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపి బీబీ పాటిల్, ప్రభుత్వ విప్ గంపగోవవర్దన్, ముజీబుద్దిన్,తిర్మల్‌రెడ్డి,మున్సిపల్ చైర్ పర్సన్, వివిద మండలాల ఎంపిపిలు, జడ్పిటిసీలు, బిఆర్‌ఎస్ పార్టీ అద్యక్ష కార్యదర్శులు,గ్రామ అద్యక్షులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News