Monday, January 20, 2025

ఏపార్టీ పొత్తు లేకుండా ఒంటరిగా పార్లమెంటు ఎన్నికల్లో పోటీ

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ నాయకులు బిజెపి చేరాలని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి పిలుపు

మన తెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో బిజెపి పార్లమెంటు ఎన్నికల్లో ఏపార్టీ పొత్తు లేకుండా ఒంటరిగా 17 స్ధానాల్లో పోటీ చేస్తుందని కేంద్ర మంత్రి, ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. బిఆర్‌ఎస్ నాయకులంతా బిజెపిలో చేరాలని పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి సమగ్ర కార్యాచరణ కోసం పార్టీ పెద్దలను కలిశానని పేర్కొన్నారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియాతో మాట్లాడుతూ శుక్రవారం తమ పార్టీ ఎన్నికల కమిటీ ఢిల్లీలో సమావేశం కానుందని వ్యాఖ్యానించారు.

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి అనుకూలంగా ఉండనుందని, మెజార్టీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ ప్రజల దృష్టి మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారని, బిజెపి విజయం సాధించదని కుమ్మక్కు అవుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు ఓటేసిన బిఆర్‌ఎస్‌కు ఓటేసిన ఒక్కటేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు బిజెపికి ప్రధాన పార్టీ అని, బిఆర్‌ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీలో ఉండదన్నారు. బిఆర్‌ఎస్ అరకొర సీట్లు గెలిచిన, ఓడినా తెలంగాణకు ఒరిగేది, పోయేది ఏం లేదని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ ఎంఐఎం సీటుతో పాటు తెలంగాణలో అన్ని సీట్లు గెలుస్తామని, ఈసారి అసదుద్దీన్‌ను ఓడిస్తామని సవాల్ విసిరారు.

సర్వేలు వాస్తవాలు కావని, తెలంగాణలో మెజార్టీ సీట్లు బిజెపి గెలిచేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌లు డూప్ ఫైటింగ్ చేస్తున్నారని, వంద రోజుల్లో హామీలు ఆమలు, అవినీతి పరులుపై చర్యలు అన్నారని ఆయన గుర్తు చేశారు. కానీ చర్యలు తీసుకోవడం ప్రభుత్వం మీనమేశాలు లెక్క పెడుతున్నారని, ఇంకా సెటిల్ మెంట్లు జరుగుతున్నాయన్నారు. కాళేశ్వరంపై చిత్తశుద్ది ప్రభుత్వానికి లేదని, తెలంగాణ సెంటిమెంట్‌తో రాజకీయాలు చేయవద్దని హెచ్చరించారు. జల వివాదాల పై ప్రజలను కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌లు మభ్య పెడుతున్నారని, నాగార్జున సాగర్ విషయంలో రెండు ప్రభుత్వాలు కలిసి చర్చించి, నిర్ణయం తీసుకోవాలన్నారు. దేశానికి మూడోసారి ప్రధానిగా మోడీ కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటాన్నారని, రాష్ట్ర కాంగ్రెస్ ఇప్పటికే కేంద్ర కాంగ్రెస్ కోసం వసూళ్లు మొదలు పెట్టిందని, కేంద్ర కాంగ్రెస్‌కు సూటు కేసులు మోస్తున్నారన్నారు. కర్ణాటకలో దోపిడీ చేసి తెలంగాణలో ఖర్చు పెడితే తెలంగాణలో కాంగ్రెస్ దోపిడీ చేస్తోందన్నారు. కాంగ్రెస్ కూటమీ బీటలు వారుతోందని, బిజెపి అత్యధిక స్థానాలు తెలంగాణ నుంచి గెలుస్తుందన్నారు. డబ్బుల కోసం మంత్రులు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బెదిరిస్తున్నారని, తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో లో బిజెపి స్వతంత్రంగా పోటీ చేస్తోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News