- Advertisement -
హైదరాబాద్: నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. నాగార్జున సాగర్‌కు 1,26,796 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. నాగార్జునసాగర్ పది గేట్లు ఎత్తి 81000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. నాగార్జున సాగర్ ప్రస్తుత, పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 312.5 టిఎంసిలుగా ఉంది. నాగార్జున సాగర్ నిండుకుండను తలపిస్తోంది. కర్నాటక రాష్ట్రంలో భారీ వర్షాలు కురవడంతో శ్రీశైలం ప్రాజెక్టు నిండడంతో దిగువకు నీటిని విడుదల చేశారు.
- Advertisement -