Sunday, January 19, 2025

పశువుల అక్రమ రవాణాపై నిరంతరం తనిఖీలు: ఎస్‌పి

- Advertisement -
- Advertisement -

వికారాబాద్ : బక్రీద్ పండుగ ఇతర సందర్భాలలో ఆవులను లేగదుడాల ను తరలించడం చట్టా ప్రకారం విరు ద్ధమని ఇదివరకే సంబంధిత అధికారులతో, పోలీస్ అధికారుతో సమ న్వయ సమావేశం ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ కోటి రెడ్డి తెలిపారు. సందర్భంగా జిల్లాలో ఆవులను లేగదు డాలను తరలించ వద్దని, ఒకవేళ తరలిస్తూ పట్టుబడితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని, ఆవుల, లేగదుడల అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లాలో నాకాబందీ, వెహికిల్ చెకింగ్‌లు, చెక్ పోస్ట్లు ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లాలో అన్ని వైపులా నుండి వచ్చి పోయే వాహనాలను తనిఖీ చేసేందుకు ఆలంపల్లి ఎక్స్ రోడ్, ధారూర్ ఎక్స్ రోడ్, మోమిన్ పేట్ ఎక్స్ రోడ్, అంతారం గేట్, కొత్లాపూర్, ఇందర్చేడ్, లక్ష్మినారాయణపూర్ ఎక్స్ రోడ్, రాఘ వాపూర్, అంగడిచిట్టంపల్లి రావులపల్లిలో మొత్తం 10 చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేసి అక్రమ రవాణా పైన తనిఖీలు చేస్తున్నామన్నారు. జిల్లాలో ఎవ రికైనా అనుమానం వచ్చినా, తమ తమ పరిధిలలోని అధికారులకుగాని, డైల్ 100కు గాని కాల్ చేసి చెప్పాలని ఎస్‌పి కోటిరెడ్డి కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News