Wednesday, January 22, 2025

బిసి కుల వృత్తులకు నిరంతరం ఆర్థిక సాయం

- Advertisement -
- Advertisement -
  • మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

వేల్పూర్: దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని మంచి పనులు సిఎం కెసిఆర్ పేదలకోసం చేస్తున్నారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నియోజకవర్గంలో బిసి కుల వృత్తులలో అర్హులైన లబ్ధిదారులకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చెక్కులను మంత్రి అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ  సమాజంలో ప్రతిఒక్కరూ సంతోషంగా ఉండాలని, ఎవరూ ఆకలితో ఆలమటించకూడదని ఆలోచించే వ్యక్తి కెసిఆర్ అని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పేదలకు బీడీ పెన్షన్లు కూడా ఇవ్వలేదని, ఎన్ని కష్టాలు వచ్చినా పెన్షన్లు ఇస్తున్నామని, పేద ఆడబిడ్డల కోసం కల్యాణలక్ష్మీ, వేల కోట్ల ఖర్చుతో ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్లకు ధీటుగా తయారుచేసి ప్రజలకు నాణ్యమైన వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. కెసిఆర్ కిట్ మానవీయ కోణం ద్వారా వచ్చిన గొప్ప పథకమని, సంపద సృష్టించి పేదలకు పంచాలనేదే సిఎం కెసిఆర్ సంకల్పమన్నారు. సాగునీరు, ఉచిత కరెంటు, తాగునీటి కోసం లక్షల కోట్లు ఖర్చు చేస్తూ ప్రజలకు అందిస్తున్నామని అన్నారు.

ప్రతి నెలా నియోజకవర్గానికి 300 చొప్పున బిసిలకు ఆర్థిక సహాయం అందిస్తామని, ప్రజల ఆశీర్వాదంతో మూడోసారి కూడా కెసిఆర్ ముఖ్యమంత్రి అవుతారని, కెసిఆరే తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అని మంత్రి వేముల పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో డిసిసిబి ఛైర్మన్ రమేష్‌రెడ్డి, కోటపాటి నరసింహనాయుడు, మండల బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు నాగధర్‌రెడ్డి, ఆర్‌టియు మెంబర్ రేగుల రాములు, ఎంపిపి బీమ జమున, సర్పంచ్ తీగల రాధ మోహన్, ఉప సర్పంచ్ సత్యం, గ్రామ కమిటీ అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News