Monday, December 23, 2024

సిసి కెమెరాలతో నిరంతర నిఘా

- Advertisement -
- Advertisement -
  • సైబర్ మోసాలకు గురి కావొద్దు
  • సంగారెడ్డి ఎస్పి రమణ కుమార్

సంగారెడ్డి: సైబర్ మోసాలకు గురైతే 1930 నెంబర్‌కు ఫోన్ చేయాలని జిల్లా ఎస్పీ రమణ కుమార్ సూచించారు. క్రైమ్ రివ్యు మీటింగ్‌లో భాగంగా మంగళవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పోలీస్ అధికారులతో నెల వారి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో (అండర్ ఇన్వెస్టిగేషన్) ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకొన్నారు. కేసుల దర్యాప్తులో వేగం పెంచి, నాణ్యమైన దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి, నేరస్తులను న్యాయస్తానం ముందు హాజరుపరచాలని ఎస్.హెచ్ఒలకు సూచనలు చేశారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ చేస్తూ, కేసుల చెదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని సూచించారు. పోక్సో, ఎన్‌డిపిఎస్ ఆక్ట్ వంటి కేసులలో 60 రోజులలోపు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలన్నారు.

ఎవరైనా గంజాయిని సాగు లేదా సరఫరా చేసినా, నిల్వ చేసినా ఈ వ్యక్తులపై చట్టరిత్య తగు చర్య తీసుకోవాలని, రిపిటేడ్ అఫెండర్స్ పై పిడి ఆక్ట్ నమోదు చేయాలన్నారు. పొరుగు రాష్ట్రాల నుండి అక్రమ మద్యం, డీజిల్, పెట్రోల్ రావాణాలను అరికట్టాలని, అక్రమ రావాణాకు పాల్పడిన వారిపై చట్టరిత్య కఠిన చర్యలను తీసుకోవాలన్నారు. వర్టికల్ పనీతిరులో మెరుగైన ప్రదర్శన కనబరిచి, జిల్లాను ముందు వరుసలో నిలపాలని, ఎస్‌హెచ్‌ఒలకు సూచించారు. ఆయా వర్టికల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి, అధికారులకు రివార్డులు అందించడం జరుగుతుందన్నారు. జిల్లాలో నేరాల అదుపునకు తమతమ సబ్- డివిజన్‌లలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలని, ధృవపత్రాలు లేని వాహనాలను, అనుమానితులను అదుపులోకి తీసుకోవాలని డిఎస్‌పిలకు సూచించారు.రోడ్డు ప్రమాదాల కేసులలో నేర విచారణ చేసేటప్పుడు ఆ నేరం ఏ విధంగా జరిగింది. అందుకు కారణమైన వాహనంపై మాత్రమే కేసు నమోదు చేయాలి.

అంతేగానీ వాహనం పెద్దదా, చిన్నదా అని చూడకూడదు అన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కలిగి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. మోటార్ సైకిల్ నడిపే వ్యక్తితో పాటు వెనకాల కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, అలాంటి పక్షంలో తల్లిదండ్రులు శిక్షార్హులు అవుతారన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు వివిధ గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. నేషనల్ హైవేలకు కలిసే అప్రోచ్ రోడ్లపై స్పీడ్ బ్రెకర్స్ వేయించడం, హైవే రోడ్డు వ్యూ క్లియర్ గా ఉండేలా చూడాలని ఎస్‌హెచ్‌ఒలకు సూచించారు. నేర నియంత్రణలో సిసి కెమెరాల ఉపయోగాల గురించి ప్రజలకు వివరిస్తూ, స్వచ్చంధంగా వారి గ్రామాలలో మరియు ప్రధాన కూడళ్లల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు. నేరాల నియంత్రణతో పాటు దర్యాప్తు చేదనకు దోహదపడే సిసి కెమెరాల ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయాలన్నారు. జిల్లాలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ప్రజాప్రతినిధులు వ్యాపారస్తులు వివిధ కుల సంఘాల వారు ముందుకు రావాలని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడంలో సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయన్నారు.

హైవేలు, ప్రధాన కూడళ్లలో, పార్కింగ్ ప్రాంతాలలో, పెట్రోల్ పంపులలో, దాబాలలో సిసి కెమెరాల ఏర్పాటు చేసుకునెలా సంభందిత యజమానులకు తెలియజేయాలని ఎస్‌హెచ్‌ఒలకు సూచనలు చేశారు. స్మార్ట్ ఫోన్‌ల వాడకం విపరీతంగా పేరుగున్న నేటి సమాజంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయని, అందుకు ప్రధాన కారణం ప్రజలలో సైబర్ నేరాల గురించి అవగాహన లేమి, డబ్బులు ఫ్రీ గా వస్తాయని చెప్పగానే ఆశపడి అట్టి సైబర్ నెరగాళ్లకు ఓటిపి, పాస్‌వర్డ్ చెప్పడం. ఆన్లైన్‌లలో అపరిచితులతో పరిచయాలకు దూరంగా వుండాలని, సూచించారు. ఆన్లైన్ మోసాల గురించి ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పోలీసు కళాబృంధం ఆద్వర్యంలో వివిధ నాటకాల రూపంలో ప్రజల ముందుకు వెళ్ళి వారిని చైతన్యపరచాలన్నారు. అనవసర లింక్ లు ఓపెన్ చేసి కష్టాలు కొని తెచ్చుకోవద్దన్నారు. ఎవరైనా సైబర్ మోసాలకు గురైనట్లైతే వెంటనే 1930 నెంబర్ కు ఫిర్యాదు చేయాలన్నారు. ఈ నేర సమీక్షా సమావేశంలో జహీరాబాద్ డిఎస్పి రఘు, నారాయణఖేడ్ డిఎస్పి వెంకట్ రామ్ రెడ్డి, డిసిఆర్‌బి డిఎస్పి బాలాజీ, ఇన్‌స్పెక్టర్ బి.రమేష్, ఎస్.బి. ఇన్‌స్పెక్టర్ మహేష్ గౌడ్. జిల్లా సిఐలు, ఎస్‌ఐలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News