న్యూఢిల్లీ: సాధారణంగా పురుషులు గర్భనిరోధకం కోసం వాసెక్టమీ లేదా కండోమ్స్ వాడుతుంటారు. అయితే పురుషులకు ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా స్త్రీలు గర్భం దాల్చకుండా ఉండేలా ఇంజెక్షన్‌ను డెవలప్ చేసినట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెల్లడించింది. ఈ ఇంజెక్షన్‌తో ఎలాంటి చెడు ఫలితాలు లేవని, చాలా సురక్షితమైందని ఐసీఎంఆర్ వివరించింది. 25 నుంచి 40ఏళ్ల మధ్యనున్న 303 మందిపై నిర్వహించిన మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు విడుదల చేసింది.
అంతర్జాతీయ అండ్రాలజీ జర్నల్‌లో ఈ ఫలితాలను ప్రచురించారు. 60 ఎంజీ రివర్స్‌బుల్ ఇన్‌హిబిషన్ ఆఫ్ స్పెర్మ్ అండర్ గైడెన్స్ (ఆర్‌ఐఎస్‌యూజీ) ఇంజెక్షన్‌ను పురుషులకు ఇవ్వడం వల్ల, శక్తి లేనటువంటి వీర్య కణాలను ఉత్పత్తి కానున్నట్టు అధ్యయనంలో తెలిపారు. అజూ స్పెరియా కణాలు 97.3 శాతం ఉన్నట్టు నిర్ధారించారు. దీనివల్ల 99.02 శాతం గర్భాన్ని నివారించవచ్చు అని అధ్యయనంలో పేర్కొన్నారు. ఈ ఇంజెక్షన్‌కు సంబంధించి ఢిల్లీ, ఉదంపూర్, లుథియానా, జైపూర్, ఖరగ్‌పూర్‌లలో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు.