Monday, December 23, 2024

కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొపెసర్లను రెగ్యులర్ చేయాలి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు బైకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లను డిగ్రీ కాలేజ్ లెక్చరర్ లను పాలిటెక్నిక్ లెక్చరలను రెగ్యులర్ చేసిన విధంగా తమను కూడా క్రమబద్దీకరణ చేయాలని కోరారు. తమకు యూజీసీ నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు ఉన్నాయని వెంటనే రెగ్యులర్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

Also Read: 24 గంటలు విద్యుత్తును అందించేది తెలంగాణనే

ఎన్నో సంవత్సరాలుగా యూనివర్సిటీకి బోధన పరిశోధన పరిపాలన రంగాల్లో పనిచేస్తూ రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలలో సుమారు 1500 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొపెసర్లు సేవలు అందిస్తున్నామని తమ సర్వీసును గుర్తించాలని ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకులు డా. వేల్పుల కుమార్, ఉపేందర్,డి. తిరుపతి, కల్వపల్లి వెంకటేష్ ,ఆనంద్, సిహెచ్ పరందాములు, ప్రేమయ్య, విజయేందర్ రెడ్డి, సిహెచ్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News