Wednesday, January 22, 2025

కాంట్రాక్టు ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి: టిఎస్ యుటిఎఫ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అత్యున్నత న్యాయ స్ధానం సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కెజిబివి, యుఆర్‌ఎస్, సమగ్ర శిక్ష ఉద్యోగులకు బేసిక్ పే ఇవ్వాలని టిఎస్ యుటిఎఫ్ డిమాండ్ చేసింది. గురువారం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన చలో ఎస్పీడి ఆఫీస్ ఉద్రిక్తంగా మారింది. జోరు వానను కూడా లెక్క చేయకుండా భారీ సంఖ్యలో హాజరైన మహిళా ఉద్యోగులు ఐదుగంటల పాటు డియస్‌ఈ కార్యాలయాన్ని దిగ్బంధించారు. ఇరవై సంవత్సరాలుగా పని చేస్తున్నా, గురుకులాలతో సమానంగా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నా తమకు శ్రమకు తగిన వేతనాలు ఇవ్వటం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈసందర్భంగా ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి హాజరై సంఘీభావం తెలిపి కెజిబివి, యుఆర్‌ఎస్, సమగ్ర శిక్ష ఉద్యోగులకు కనీస వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంరతం టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి ప్రసంగిస్తూ మంత్రులు, అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా, ఆందోళనలు చేసినా ఫలితం లేనందున డియస్‌ఈ ముట్టడి చేయాల్సిన పరిస్థితి అనివార్యం అయిందన్నారు. న్యాయమైనవైనందున అన్ని సమస్యలను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఈసందర్భంగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి నేతృత్వంలో ప్రతినిధి బృందం సచివాలయం లోకి వెళ్ళి విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి లను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. విద్యాశాఖ అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తానని అన్నారు. వీలైనంత త్వరగా మరోసారి చర్చలకు సమయం ఇస్తామన్నారు. సిఎస్ శాంతికుమారి విద్యాశాఖ అధికారులనుండి ప్రతిపాదనలు తెప్పించి పరిశీలిస్తామన్నారు.
ఈకార్యక్రమంలో టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ దుర్గా భవాని, కోశాధికారి టి లక్ష్మారెడ్డి, కార్యదర్శులు వి శాంతికుమారి, జి నాగమణి, వై జ్ఞానమంజరి, ఎ వెంకట్, ఎస్ రవి ప్రసాద్ గౌడ్, సింహాచలం, విశాలాక్షి, రేణుక, సుమన తదితరులు పాల్గొన్ని ప్రసంగించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News