Wednesday, January 22, 2025

కరెంట్ షాక్‌తో కాంట్రాక్ట్ కార్మికుడు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలకేంద్రంలో విధులు నిర్వర్తించే జూనియర్ లైన్‌మెన్ రాగ్యానాయర్ ఆదేశాలతో ఇదే ప్రాంతంలోని ఓ పొలంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్ వద్ద రిపేర్లు చేపట్టిన కాంట్రాక్ట్ కరెంటుకార్మికుడు(హెల్పర్) బైరం నరేష్(32) ఈనెల 29న కరెంట్ షాక్‌తో మృతి చెందారు. కాగా, మృతుని భార్య మమత తన తొమ్మిది నెలల బాబుతో పాటు ఇతర బాధిత కుటుంబ సభ్యులు, మాల మహానాడు ఆధ్వర్యంలో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, శుక్రవారం ఉదయం మిర్యాలగూడ పట్టణంలోని విద్యుత్ డిఈ ఆఫీస్‌ను ముట్టడించి, అనంతరం ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు, దళిత సంఘం నేతలు మాట్లాడుతూ, ట్రాన్స్‌పార్మర్ వద్ద ఎల్‌సి విషయంలో నిర్లక్షం కారణంగానే నరేష్ మృతి చెందాడని, ఇందుకు విద్యుత్‌శాఖ అధికారులు బాధ్యత వహించి, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సుమారు గంటన్నర పాటు ధర్నా చేపట్టడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. కాగా, న్యాయం చేస్తామని విద్యుత్ శాఖ అధికారుల హామీతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నేతలు యర్రమాళ్ల దినేష్, తాళ్లపల్లి రవి, బెజ్జం సాయి తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News