Monday, January 20, 2025

మంత్రి ఇంటి ముందు బైఠాయించిన కాంట్రాక్ట్ టీచర్లు

- Advertisement -
- Advertisement -

తార్నాక ః కాంట్రాక్ట్ అద్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఓయు జేఏసి చైర్మన్ డా.ఎ.పరుశురామ్ పేర్కోన్నారు.ఈ మెరకు శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముందు కాంట్రాక్ట్ అద్యాపకులు బైఠాయించారు.అనంతరం ఓయులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డా.పరుశురామ్ మాట్లాడుతు తమను రెగ్యులరైజ్ చేయాలని కోరతు రాష్ట్ర వ్యాప్తంగా 12 యునివర్శిటీలకు చెందిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు మంత్రి ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపామన్నారు.ఎన్నికల సమయం దగ్గర పడుతున్నందున రెగ్యులరైజేషన్ చేసే ప్రాసెస్‌ను వెంటనే చేపట్టాలని కోరామన్నారు.వారం రోజుల్లో ప్రకటన రాకుంటే రాష్ట్ర వ్యాప్తంగా యునివర్శిటీలలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని అన్నారు.అందుకు స్పందించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు విషయంలో ముఖ్యమంత్రి కేసిఆర్ సుముఖంగా ఉన్నారని తెలిపారన్నారు. వచ్చే వారం జరిగే క్యాబినెట్ సమావేశంలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల రెగ్యులరైజేషన్ పై నివేదికను ముఖ్యమంత్రి కేసిఆర్‌ను అందజేస్తామని హామి ఇవ్వడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో కన్వీనర్ దర్మతేజ,కో కన్వీనర్లు డా.వేల్పుల కుమార్,టి.వెంకటేష్,కేయు జెఎసి చైర్మన్ డా.కరుణారావు, కన్వీనర్లు డా.రాజేష్,డా.చిర్ర రాజు,జెఎన్‌టియుహెచ్ శివారెడ్డి,జెఎన్‌ఎ,ఎఫ్‌ఏయు జే.వెంకటేషం,మహిళా విశ్వ విద్యా లయం నుండి శేఖర్‌రెడ్డి,నరసింహా,తిరుపతయ్య తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News