Sunday, January 19, 2025

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని తొలగించే కాంట్రాక్ట్ ఎలాన్ మస్క్ కు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఈ దశాబ్దం చివరికల్లా కూల్చివేయనున్నారు. అయితే ఈ కూల్చివేసే కాంట్రాక్టును అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ , ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ కు ఇచ్చింది. అందుకు ఒప్పందం కూడా కుదుర్చుకుంది.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్) అనేది మానవ నివాసయోగ్యమైన, మానవ నిర్మితమైన ఉపగ్రహం. భూమికి 400 కిమీ. ఎత్తులో ఉన్న కక్ష్యలో పరిభ్రమిస్తుంటుంది. ఇది ఒకసారి భూమిని చుట్టేందుకు 93 నిమిషాలు పడుతుంది. రోజుకు 15.5 సార్లు చుట్టేస్తుంది. అమెరికా, రష్యా, జపాన్, ఐరోపా, కెనడా సంయుక్తంగా ఈ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని నిర్వహిస్తున్నాయి. దీని జీవిత కాలం 2031 వరకు ఉంది, కనుక ఆ తర్వాత తొలగించనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News