Monday, April 7, 2025

రాష్ట్ర సచివాలయంలో కాంట్రాక్టర్ల మెరుపు ధర్నా

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం కాంట్రాక్టర్లు మెరుపు ధర్నా చేపట్టారు. బిల్లులు రావడం లేదంటూ ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క చాంబర్ ఎదుట కాంట్రాక్టర్‌లు ఆందోళనకు దిగారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన కాంట్రాక్టర్లు ఆర్థిక శాఖ మంత్రి భట్టి కలిసేందుకు వచ్చారు. అయితే ఎస్పీఎఫ్ సెక్యూరిటీ సిబ్బంది ఆపడంతో కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు. దీంతో కాంట్రాక్టర్లు నిరసన విరమించేలా పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మూడు సంవత్సరాలకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని కాంట్రాక్టర్లు ఆరోపించారు. ఈ పెండింగ్ బిల్లులు క్లియర్ కావాలంటే కనీసం 20 శాతం కమీషన్ అధికారులు అడుగుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, కాంట్రాక్టర్లు ఆందోళన చేస్తుండడంతో భట్టి విక్రమార్క వాళ్లను కలవకుండా బయటకు వెళ్లిపోయినట్టుగా తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News