Monday, December 23, 2024

విద్యుత్ సంస్థల అభివృద్ధిలో కాంట్రాక్టర్లు భాగస్వామ్యం కావాలి: జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

కాంట్రాక్టర్స్ అసోసియేషన్ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ

సూర్యాపేట: విద్యుత్ సంస్థల అభివృద్ధిలో కాంట్రాక్టర్లు భాగస్వామ్యం కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి తెలిపారు. తెలంగాణా రాష్ట్ర విద్యుత్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ రూపొందించిన 2022 క్యాలెండర్, డైరీలను ఆయన గురువారం ఉదయం సూర్యాపేట క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు విద్యుత్ రంగంలో ఏర్పడ్డ సంక్షోభమే మూలమైందని ఆయన గుర్తుచేశారు. ఆ విషయాన్ని మొట్టమొదట గుర్తించింది ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అని ఆయన చెప్పారు. అటువంటి రంగాన్ని కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో ముందుకు తీసుకపోయింది సిఎం కెసిఆర్ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యస్ కె మాజిద్, నాయకులు పర్వతాలు, దోసకాయల శ్రీనివాస్, వేణుగోపాల్, యాదయ్య, సత్తిరెడ్డి, వహిద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News