Saturday, December 21, 2024

సంయమనంతో శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించండి

- Advertisement -
- Advertisement -
  • గజ్వేల్ ఘటనపై కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ప్రజలకు విజ్ఞప్తి

గజ్వేల్: అన్ని వర్గాల ప్రజలు సంయమనం పాటించి సిద్దిపేట జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా జిల్లా అధికార యంత్రాంగానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఒక ప్రకటన ద్వారా పిలుపునిచ్చారు. సోమవారం గజ్వేల్ పట్టణంలో జరిగిన ఒక సంఘటపై ఆ ప్రాంతంలో ఉన్న అన్నివర్గాల వారు విజ్ఞతతో ఆలోచించి ఎలాంటి పుకార్లు, తప్పుడు వార్తలను నమ్మవద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఏదైనా ఆందోళన కలిగిన లేదా ఫిర్యాదు చేయాలన్న స్థానిక పోలీసులను సంప్రదించాలని, అంతే కానీ చట్టాన్ని ఎవరిచేతిలోకి తీసుకోవద్దని కలెక్టర్ తన ప్రకటనలో పేర్కొన్నారు, శాంతి భద్రతల పరిరక్షణలో అన్ని వర్గాల ప్రజలు జిల్లా అధికార యంత్రాంగానికి, పోలీసు శాఖ వారికి సమకరించి సంయమనం పాటించాలని కోరారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నడచుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ తన ప్రకటనలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News