- డిఆర్‌ఓ నగేష్
సంగారెడ్డి: తప్పులు లేని పాదర్శక ఓటరు జాబితాను రూపొందించడంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని డిఆర్‌ఓ నగేష్ అన్నారు. శనివారం సంగారెడ్డిలోని డిఆర్‌ఓ ఛాంబర్‌లో పొలిటికల్ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఓటర్లకు ఈవిఎం వివి ప్యాట్‌లపై అవగాహన కల్పిస్తామన్నారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గలలోని అన్ని గ్రామాల్లో మొబైల్ వ్యాన్‌ల ద్వారా ఓటర్లకు అవగాహన కల్పించేందుకు ప్రతి నియోజకవర్గానికి ఈవిఎం, వివి ప్యాట్‌తో కూడిన ఒక మొబైల్ వాహనాన్నీ ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తామన్నారు. మొబైల్ వాహనానికి ఒక అధికారిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఏ విధంగా ఓటు వేయాలి వేసిన ఓటును ఏవిధంగా చూసుకోవచ్చు అనే దానిపై మాక్ పోలీంగ్ నిర్వహించి ఓటర్లకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.
మొబైల్ వ్యాన్‌లో ఏ రోజు ఏగ్రామానికి వస్తాయి అనే వివరాల పట్టికను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేశారు. స్పెషల్ సమ్మరీ రివిజన్ 2కు సంబంధించి ఆగస్ట 21న డ్రాప్ట్ ఓటరు లిస్టు ప్రచురితమవుతుందన్నారు. ఇప్పటిదాకా నమోదైన ఫారం 6,7,8 వివరాలు పరిశీలన పూర్తయి డిస్పోజల్ చేసిన వివరాలను వారికి తెలియజేశారు. పోలీంగ్ కేంద్రాలరేషనలైజేషన్ చేయాల్సి ఉందని 1400కన్నా ఎక్కువ ఓటర్లు న్న పోలీంగ్ కేంద్రాలను గుర్తించి మరో పోలీంగ్ కేంద్రం ఏర్పాటు చేయడానికి సహకరించాలన్నారు. ఈవిఎం, వివి ప్యాకెట్‌లపై ప్రజలకు అవగాహన కల్పించడంలో పోలీంగ్ కేంద్రాల రేషనలైజేషన్ తప్పులు లేని ఓటరు జాబితా రూప కల్పనకు సహకరించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను డిఆర్‌ఓ కోరారు. ఈ కార్యక్రమంలో ఎఓ మైపాల్‌రెడ్డి, నాయకులు జగన్, గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వజీర్‌బేగ్, ప్రేమానదం, బిక్షపతి తదితరులున్నారు.