హైదరాబాద్ : నీటి వనరులకు పెద్ద ఎత్తున ఇబ్బంది కలిగిస్తున్న గుర్రపు డెక్కను శుభ్రం చేసేందుకు అధ్యయనం దోహదపడుతుందని ఇపిటిఆర్‌ఐ ఇన్నోవేషన్ హబ్ హెడ్ డాక్టర్ జె.స్వరాజ్ అన్నారు. సిద్దిపేట పట్టణంలోని 39వ వార్డులో జలవనరుల పరిశుభ్రతకు సహకరించేoదుకు మున్సిపల్ కౌన్సిలర్ బోనగిరి దీప్తి నాగరాజుతో పర్యావరణ పరిరక్షణ శిక్షణ, పరిశోధనా సంస్థ (ఇపిటిఆర్‌ఐ) ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ హబ్ మంగళవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ సందర్భంగా డాక్టర్ జె. స్వరాజ్ మాట్లాడుతూ నీటి వనరులకు పెద్దఎత్తున ఇబ్బంది కలిగిస్తున్న అత్యంత ఆక్రమణ జాతులకు చెందినా గుర్రపు డెక్క శుభ్రం చేసేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని అన్నారు. ఇన్నోవేషన్‌లను ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ సమస్యల పరిష్కారాల కోసం డైరెక్టర్ జనరల్ వాణి ప్రసాద్ కృషి చేస్తున్నాట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్ర మంత్రి టి.హరీశ్‌రావు నాయకత్వంలో సిద్దిపేట మున్సిపాలిటీలో గుర్రపుడెక్కను ఉపయోగించదగిన కంపోస్ట్‌గా మార్చే ఆవిష్కరణను అమలు చేయడo ద్వారా స్వచ్ఛబడి పరిశోధన కేంద్రంగా తీర్చిదిద్దానునట్లు నాగరాజు తెలిపారు. కార్యక్రమంలో మధుచంద్రిక , రైసుద్దీన్, శేఖర్‌బాబు, సూర్యనారాయణ పాల్గొన్నారు.