Saturday, November 9, 2024

ఇంటింటి ఇన్నోవేటర్

- Advertisement -
- Advertisement -

పల్లెల్లోనూ ఆవిర్భవిస్తున్న ఆవిష్కర్తలు

మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడమే లక్ష్యంగా సాగుతున్న కార్యక్రమం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యార్థినుల ఆవిష్కరణల ప్రదర్శన

తిలకించి చిన్నారులను ప్రశంసించిన మంత్రి కెటిఆర్

3ఐ మంత్రానికి ఇది దోహదం చేస్తుందని కితాబు

మన తెలంగాణ/హైదరాబాద్ : “కొత్త ఆలోచనలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ’ఇంటింటా ఇన్నోవేటర్’ అందరినీ కలుపుకుపోవడానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇన్నోవేటర్స్, ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్‌లు రాష్ట్ర ఆర్థిక వృద్ధిని నడిపించడంలో పాత్ర పోషిస్తున్నాయి, ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సమ్మిళిత వృద్ధికి 3ఐ మంత్రానికి దోహదం చేస్తున్నాయి’ అని ఐటి, పరిశ్రమల మంత్రి కెటిఆర్ అన్నారు.
ప్రతిభను వెలికితీయడమే
ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమ లక్ష్యం
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగిఉంటుంది. దానిని వెలికితీసి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వివిధ రంగాల్లో నెలకొన్న సమస్యలకు పరిష్కారం కనుగొనటమే లక్ష్యంగా అన్నదాతలు, విద్యావేత్తలు, వ్యాపారులు, ఉద్యోగులు, గృహిణులు ఇలా ఎవరైనా ఆవిష్కరణలు చేయవచ్చు. తమ ఆలోచనలకు సృజనాత్మకతను జోడించి పూర్తి వివరాలతో ప్రయోగాలను ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఆవిష్కరణలను ఎంపిక చేసి ప్రోత్సాహక బహుమతులను అందజేస్తుంది. వివిధ వర్గాలకు చెందిన వారిలో సృజనాత్మకతను వెలికితీసి ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహి స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ చొరవను ఆవిష్కర్తలంతా తప్పనిసరిగా వినియోగించు కోవాలని తెలంగాణ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ శాంతా తౌటం కోరారు. సందేహాలు ఉంటే 8328599157 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. 2019లో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా విజయవంతంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు ఈ ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ఆవిష్కర్తలు, ఎన్నో ఆవిష్కరణలు వెలుగులోకి వచ్చాయన్నారు. ప్రతి వ్యక్తిలో దాగి ఉన్న ఆలోచనలను వెలికితీసి వాటిని ఆవిష్కరణలుగా మార్చి సమాజంలోని సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, గృహిణులు, రైతులు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారు ఎవరైనా పాల్గ్గొనవచ్చు. రాష్ట్ర జిల్లాస్థాయిలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి బహు మతులు అందజేస్తారు.
విద్యార్థినులకు అభినందన
తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టిఎస్‌ఐసి) ద్వారా ’ఇంటింటా ఇన్నోవేటర్’ కార్యక్రమాన్ని ప్రారంభించి రైతులు, విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులు, గృహిణులు ఇలా అన్ని వర్గాల ప్రజలలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి వారి ఆవిష్కరణలను ప్రభుత్వం ప్రొత్సహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట, హన్మాజీపేట్, దమ్మన్నపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థినులు వారి ఆవిష్కరణ లను ప్రదర్శించారు. మంత్రి కేటీఆర్ ఆ ఆవిష్కరణలను పరిశీలించి, వాటి పనితీరు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులను అభినందించారు.
‘బస్సులో భరోసా’ ప్రారంభించిన కెటిఆర్
మహిళా భద్రతకు వినూత్న కార్యక్రమాలు చేపడుతూ వారికి భరోసాగా నిలుస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ యంత్రాంగం మరో కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలు, స్కూల్ బస్సుల్లో ప్రయాణించే పిల్లల భద్రతకు భరోసా కల్పించేందుకు ’బస్సులో భరోసా’ పేరుతో ఆర్టీసీ, స్కూల్ బస్సుల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను నేడు మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈవ్ టీజింగ్‌ను తగ్గించే లక్ష్యంతో మన జిల్లాలోని మొత్తం 130 RTC బస్సులు మరియు అన్ని పాఠశాల బస్సులలో పోలీస్ కంట్రోల్ రూమ్‌కు కనెక్టివిటీతో కూడిన CCTV కెమెరాలను సిరిసిల్ల పోలీసులు ఏర్పాటు చేశారు. అత్యుత్తమ చొరవ చూపిన పోలీసు అధికారులను ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ అభినందించారు.
ప్రతి ఏడాది లాగానే.. ఈ ఏడాది కూడా…
ఏ వృత్తిలో ఉన్నా కొత్త ఆలోచనలు ఉన్నవారు ఇందులో పాల్గొనే అవకాశం కల్పించారు. తమ ఆలోచనలకు సృజనాత్మకతను జోడించి పూర్తి వివరాలతో ప్రయోగాలను ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే ఆసక్తి ఉన్న ఆవిష్కర్తలు https://www.teamtsic.org/ వెబ్‌సైట్‌లో ఆగస్టు 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆవిష్కరణల వివరాలను ఆగస్టు 5వ తేదీలోగా వాట్సాప్ 9100678543కి పంపాలి. అందులో ఆవిష్కరణకు సంబంధించి ఆరు వాక్యాలతో వివరణ కూడా ఉండాలి. ఆవిష్కరణకు సంబంధించి ఓ రెండు నిమిషాల వీడియో, నాలుగు ఫొటోలు తీసి పంపాలి. ఆవిష్కరణ పేరు, సెల్‌ఫోన్ నంబర్, వయస్సు, ప్రస్తుత వృత్తి, గ్రామం/పట్టణం, జిల్లా పేరు రాయాలి. కార్యక్రమానికి ఆగస్టు 5వ తేదీ వరకు ధరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపిన శాంతా33 జిల్లాల్లోని స్థానిక కలెక్టరేట్‌లో ఆగస్టు 15వ తేదీన ప్రదర్శనను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మన చుట్టుపక్కల, ఇళ్లు, విద్యాలయాలు, వ్యవసాయం, ఇతర సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఆవిష్కరణలు చేయాలన్న శాంతా తౌటం ఇప్పటికే ఉన్న వస్తువుల్లో కొన్ని మార్పులు చేర్చి కొత్త వాటిని కూడా రూపొందించవచ్చన్నారు. రూపొందించే ఆవిష్కరణ అందరి మెప్పు పొందేలా ఉండాలని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఆవిష్కర్త ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News