Tuesday, January 21, 2025

ఆలయాల అభివృద్ధికి సహకారం: మైనంపల్లి హన్మంతరావు

- Advertisement -
- Advertisement -

మల్కాజిగిరి: ఆలయాలు ఆధ్యాత్మిక నిలయాలు అని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. సోమవారం గురుపౌర్ణమిని పురస్కరించుకొని ఆనంద్‌బాగ్ ఆర్‌యుబి సమీపంలోని సాయిబాబా దేవాలయంలో, అదే విధంగా విష్ణుపురి ఎక్స్‌టెన్షన్ శ్రీ ద్వారకామయి సాయి బాబా దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో ఆ యన పాల్గొని సాయిబాబా ఆ శీస్సులు పొందారు. అనంతరం భక్తులకు ఏర్పాటు చేసిన అన్నసంతర్పణను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి ఎల్ల వేళలా తన వంతు సహకారం అందచేస్తానన్నారు.

అన్ని దానాల్లో కెల్లా అన్నదానం ఎంతో గొప్పదన్నారు. ఈ కా ర్యక్రమాలలో కార్పొరేటర్లు ప్రేమ్‌కుమార్, జితేంద్రనాథ్, మాజీ కార్పొరేటర్ ఎన్. జగధీష్‌గౌడ్, నాయులుబద్దం పరుశురాంరెడ్డి, అధికార ప్రతినిధి జీఎన్‌వీ సతీష్‌కుమార్, స ర్కిల్ అధ్యక్షుడు పిట్ల శ్రీనివాస్, మీ డియా కన్వీనర్ గుండా నిరంజ న్, సంతోష్ రాందాసు, మోహన్‌రెడ్డి, సూరి, సుధాకర్, ఉపేందర్, బాల కృష్ణగుప్తా ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
గౌతంనగర్‌లో…
గౌతంనగర్ డివిజన్ పరిధిలోని సాయినగర్ సాయిబాబా దేవాలయంలో గురుపౌర్ణమి వేడుకను సోమవారం ఆలయ కమిటి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించడంతో పాటు ప్రత్యేక అభిషేకం, పుష్పాలంకరణ, మహాహరతి తదితర కార్యక్రమాలు జరిగాయి.

ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ మేకల సునితరాముయాదవ్ దంపతులు ముఖ్యఅతిథిగా హజరై స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ దంపతులు మాట్లాడుతూ.. గురు పౌర్ణమి వేడుకను ప్రతి యేటా ఆలయంలో భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహిస్తుంటరని తెలిపారు. స్వామి వారి దయతో ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News