Sunday, December 22, 2024

సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం

- Advertisement -
- Advertisement -

Control room set up at Secretariat: CS somesh kumar

అన్ని జిల్లాల కలెక్టర్‌లు కంట్రోల్‌రూమ్‌లను ఏర్పాటు చేసుకోవాలి
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి
నిరంతరం కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి
లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను
అవసరమైతే ప్రత్యేక శిబిరాలకు తరలించాలి
భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్‌లతో సిఎస్ వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలతో ఇబ్బంది పడే ప్రజలకు సహాయం అందించేందుకు సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. అదేవిధంగా ప్రతి జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని కలెక్టర్లను సిఎస్ ఆదేశించారు. రాష్ట్రంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లతో సిఎస్ సోమేశ్ కుమార్ ఆదివారం వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సంబంధిత ప్రభుత్వ విభాగాలతో సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సిఎస్ ఆదేశించారు.

ప్రాణ, జంతు, ఆస్తినష్టం జరగకుండా చర్యలు…

నిరంతరం కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రాణ, జంతు, ఆస్తినష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సిఎస్ సూచించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల నీటిపారుదల, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇంధన శాఖలు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సోమేష్‌కుమార్ సూచించారు. ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదవుతుందని, ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయని సంబంధిత కలెక్టర్‌లు ఎప్పటికప్పుడు రక్షణ చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉండాలని సిఎస్ సూచించారు. ట్యాంకులు, చెరువులు, రిజర్వాయర్లు పొంగిపొర్లుతున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రమాదకర ట్యాంకులకు ఉల్లంఘనలు జరిగితే ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను అవసరమైతే ప్రత్యేక శిబిరాలకు తరలించాలని సిఎస్ సూచించారు. రోడ్లు దెబ్బతింటే వెంటనే వాటికి మరమ్మతులు చేయాలని సిఎస్ స్పష్టం చేశారు.

గ్రామాల్లోని మంచినీటి ట్యాంకులను పరిశుభ్రం చేయాలి
గ్రామాల్లోని మంచినీటి ట్యాంకులను పరిశుభ్రం చేయాలని, అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని సిఎస్ అధికారులకు సూచించారు. పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సునీల్ శర్మ, అర్వింద్ కుమార్, అడిషనల్ డిజి జితేందర్, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, పంచాయతీ రాజ్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, జీహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, పంచాయతీ రాజ్ డైరెక్టర్ హనుమంత రావు, ఎస్పీడిసిఎల్ సిఎండి రఘుమా రెడ్డిలతో పాటు సంబంధిత అధికారులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News