Wednesday, January 15, 2025

తెలంగాణలో అతి భారీ వర్షాలు.. సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నిన్న జిల్లా కలెక్టర్లతో వర్షాలపై నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో సచివాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి రాష్ట్రంలో వరదలు, వర్షాల పరిస్థితిని పర్వవేక్షించనున్నట్టు తెలిపారు. దీనికనుగుణంగా, సచివాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్ రూమ్ నెంబర్ 34లో విపత్తుల నిర్వహణా శాఖ ఆధ్వర్యంలో ఈ కంట్రోల్ రూమ్ తెరిచారు.

ఈ కంట్రోల్ రూమ్ నెంబర్ 040 – 2345 4088 అనే నెంబర్ ను కూడా ఏర్పాటు చేశారు. వర్షాలు, వరదలపరిస్థితిని జిల్లా కలెక్టర్లతో ఎప్పటి కప్పుడు సంప్రదించి వారికి కావాల్సిన సహాయసహకారాలు, తగు సూచనలను ఈ కంట్రోల్ రూమ్ ద్వారా అందిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News