Friday, November 22, 2024

ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి

- Advertisement -
- Advertisement -
ఎన్‌పిడిసిఎల్ సిఎండి గోపాలరావు

హైదరాబాద్ : రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సిబ్బంది ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎన్‌పిడిసిఎల్ (నార్తర్న్ పవర్ డిస్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ) సిఎండి ఎ.గోపాలరావు ఆదేశించారు. గురువారం ఆయన హనుమకొండలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్లు ఎన్పీడీసీఎల్ పరిధిలోని 16 సర్కిళ్ళ సూపరింటెండింగ్ ఇంజనీర్లతో రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాల పై అత్యవసర విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క సర్కిల్ పరిధిలో 24 గంటలు పని చేసేలా కంట్రోల్ రూం ఏర్పాటు చెయ్యాలని ఆదేశించారు. అలాగే ప్రతి ఒక్క స్టాఫ్ విధిగా హెడ్ క్వార్టర్స్ ఉంటూ సేవలందించాలన్నారు. మెన్ ,మెటిరియల్ ను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఎక్కడైతే అత్యవసరం అనుకుంటే వెంటనే స్పందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. నది పరివాహక ప్రాంతాలలో విద్యుత్ సంస్థకు ఎక్కువ నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తగా వ్యవహరిస్తు, తీసుకోవాల్సిన సత్వర చర్యలు తీసుకుంటూ నష్టం వాటిల్లకుండా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల తరలింపు తదితర చర్యలు తీసుకోవాలని సూచించారు. గోదావరి తీర ప్రాంతాలైన భద్రాచలం, భూపాలపల్లి, మంథని పరిసర ప్రాంతల్లో జాగ్రత్తగా ఉండాలని కోరారు.

ఎక్కడా విద్యుత్ అంతరాయాలు లేకుండా సరఫరా అందించాలని తెలిపారు. ఒక వేళ అంతరాయాలు ఉన్న యెడల ప్రత్యమ్నాయ సరఫరా అందించేటట్లు ఉండాలని చెప్పారు. వినియోగదారులకు అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా అందించేటట్లు ప్రతి ఒక్కరు నిబద్ధతతో పని చేయాలన్నారు. ట్రాన్స్ఫార్మర్లకు సంబందించి వాహనాన్ని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఎస్పియం షెడ్లలో ట్రాన్స్ఫార్మర్ల రిపేర్లు పెంచుకోవాలని, రోలింగ్ స్టాక్ కూడా సన్నధ్ధంగా ఉంచు కోవాలని కోరారు. కార్పోరేట్ ఆఫీసులోని కంట్రోల్ రూంకు సంబంధిత సమాచారాన్ని అందించడమే కాకుండా జిల్లా సంబంధిత అధికారులతో, శాఖలతో సమన్వయ పరుచుకోవాలన్నారు. వినియోగదారులు విద్యుత్ సంబంధిత సమస్యలకు, ఫిర్యాదులు తెలియజేయడానికి టోల్ ఫ్రీ నెంబరు.1800 4250028 కు లేదా 1912 కు ఫోన్ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్(హెచ్‌ఎర్, పి,ఎంఎం) బి. వెంకటేశ్వర రావు, డైరెక్టర్ ఆర్‌ఎసి) పి.గణపతి, డైరెక్టర్ (కమర్షియల్) పి.సంధ్యారాణి, డైరెక్టర్ (ప్రాజెక్ట్ ఆపరేషన్) పి.మోహన్ రెడ్డి, ఇంచార్జ్ డైరెక్టర్(ఫైనాన్స్) వి.తిరుపతి రెడ్డి, సి.జి.యంలు, 16 సర్కిళ్ళ ఎస్ ఈలు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News