Monday, January 20, 2025

మమత కుటుంబ మూలాలపై వివాదాస్పద వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

బిజెపి ఎంపిపై టిఎంసి మండిపాటు

కోల్‌కత: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కుటుంబ నేపథ్యంపై బిజెపి సీనియర్ నాయకుడు, ఎంపి దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై అధికార టిఎంసి మండిపడింది. బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు కాషాయ పార్టీ డిఎన్‌ఎని ప్రతిబింబిస్తున్నాయని టిఎంసి విమర్శించింది. దిలీప్ ఘోష్ చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యల వీడియోను టిఎంసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీదీ(మమతా బెనర్జీ) గోవాకు వెళ్లినపుడు తనను తాను గోవా బిడ్డనని చెప్పుకుంటారు. త్రిపురకు వెళ్లినపుడు త్రిపుర బిడ్డనని చెప్పుకుంటారు. తన తండ్రి ఎవరో మందు ఆమె గుర్తించాలి అంటూ ఘోష్ ఆ వీడియోలో వ్యాఖ్యానించడం వినిపించింది.

మెడినిపూర్ లోక్ పిట్టింగ్ ఎంపిగా ఉన్న దిలీప్ ఘోష్ రానున్న ఎన్నికలలో బర్ధమాన్-దుర్గాపూర్ లోక్‌సభ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టిఎంసి ప్రచారం చేసిన నినాదం బంగ్లా నిజెర్ మెయెకీ చాయ్(బెంగాల్ సొంత కుమార్తెను కోరుకుంటోంది)ని ప్రస్తావిస్తూ ఘోష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఘోష్ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని టిఎంసి నిర్ణయించింది. మమతపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఘోష్ క్షమాపణ చెప్పాలని పశ్చిమ బెంగాల్ మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శశి పంజా డిమాండ్ చేశారు. ఘోష్ వ్యాఖ్యలు బిజెపి డిఎన్‌ఎని ప్రతిబింబిస్తున్నాయని ఆమె చెప్పారు. దీనిపై ఇసి స్పందించాలి ఆమె కోరారు. బెంగాలీ మహిళలంటే ఘోష్‌కు గౌరవం లేదని, హిందూమతానికి చెందిన దేవతలన్నా, భారతదేశంలోని ఏకైక మహిళా ముఖ్యమంత్రి అన్నా ఆయనకు కొద్దిపాటి గౌరవం కూడా లేదని ఆమె విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News