Sunday, January 19, 2025

రామ్‌గోపాల్ వర్మ అభ్యర్థన తిరస్కరించిన ఎపి హైకోర్టు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టులో షాక్ తగిలింది. తనపై నమోదు అయిన కేసులు కొట్టేయాలన్న పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై గతంలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరో పణలతో ఆయనపై ఈ మధ్యే కేసు నమోదైంది. మంగళవారం విచారణకు రావాలని పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు.

సోషల్ మీడి యాలో శ్రుతి మించి కామెంట్స్ చేస్తూ ఇతరులను కించపరిచే వారిపై కేసులు నమోదు అవుతున్నాయి. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు వైసిపి మద్దతుదారు లతోపాటు రామ్‌గోపాల్ వర్మ లాంటి వాళ్లు కూడా చంద్రబాబు, లోకేష్ పవన్ కల్యాణ్‌ను తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు అవే వారి మెడకు చుట్టుకుంటున్నాయి. అందరిపై నమోదు అవుతున్నట్టుగానే రామ్‌గోపాల్ వర్మపై కూడా కేసులు రిజిస్టర్ అయ్యాయి. టిడిపి మండల ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగం ఫిర్యాదు మేరకు ప్రకాశం జిల్లా మద్దిపాడులో పోలీసులు కేసు నమోదు చేశారు.

వ్యూహం సినిమా ప్రచారంలో భాగంగా చంద్రబాబు,లోకేష్‌పై అనుచితంగా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నాడు ఆయన చేసిన కామెంట్స్‌కు సంబంధించిన సాక్ష్యాలను కూడా ఇచ్చారు. ఈ కేసు కొట్టేయాలని రామ్‌గోపాల్ వర్మ ఎపి హైకోర్టును ఆశ్రయించారు. కేసు కొట్టేయలేమని కోర్టు స్పష్టం చేసింది. అరెస్టు చేస్తా రనే భయం ఉంటే ముందస్తు బెయిల్ మంజూరు చేసుకోవాలని కోర్టు సూచించింది. కనీసం విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని కూడా అభ్యర్థించింది. దీనికి కూడా పోలీసులతోనే తేల్చుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. ఇలాంటివి తమ దృష్టికి తీసుకురావద్దని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News