Tuesday, September 17, 2024

వివాదాస్పద రెట్రో టాక్స్ రద్దు

- Advertisement -
- Advertisement -

Controversial retro tax repeal

పన్ను చట్టంలో సవరణలు కోరుతూ బిల్లు
లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి నిర్మల
పరిష్కారం కానున్న కెయిర్న్, వొడాఫోన్ వివాదాలు

న్యూఢిల్లీ : ప్రభుత్వం రెట్రోస్పెక్టివ్ టాక్స్ (పునరావృత పన్ను)ను రద్దు చేయబోతోంది. వొడాఫోన్, కెయిర్న్ ఎనర్జీ వంటి కంపెనీల నుంచి విదేశాల్లో ఎదురుదెబ్బలు తలగడం, ఈ వివాదాలు మరింత పెద్దవి కావడంతో రెట్రో టాక్స్‌ను రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించింది. విదేశీ సంస్థలతో పన్ను వివాదాలకు కారణమైన ఈ రెట్రో టాక్స్‌ను రద్దు చేసేందుకు గాను పన్ను చట్టం సవరణ బిల్లు2021ను లోక్‌సభలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. 2012 రెట్రో టాక్స్ కారణంగా కెయిర్న్, వొడాఫోన్ వంటి సంస్థలు దావా వేశాయి. వివాదాస్పద 2012 చట్టాన్ని రద్దు చేయడానికి ఒక బిల్లును కేబినెట్ ఆమోదించింది. వడ్డీ లేకుండా చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇవ్వడానికి కేంద్రం సిద్ధమైంది. వొడాఫోన్‌పై కేసులో భారత్ విఫలమైంది. గత ఏడాది డిసెంబర్‌లో అప్పీల్ దాఖలు చేసింది.

పునరావృత పన్ను నిబంధనను తొలగించే కొత్త బిల్లుపై రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ మాట్లాడుతూ, భారతదేశాన్ని మెరుగైన పెట్టుబడి గమ్యస్థానంగా మార్చేందుకు పన్ను చట్ట సవరణ బిల్లు ఒక ముఖ్యమైన చొరవ అని అన్నారు. ఈ సవరణ బిల్లు ఆమోదంతో ఐటి శాఖకు సంబంధించిన 17 పన్ను వివాదాలు పరిష్కారం అవుతాయని అన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందిన తరువాత భారత ప్రభుత్వం మొత్తం ఆర్థిక బాధ్యత రూ.8 వేల కోట్లు ఉంటుంది. హేగ్‌లోని అంతర్జాతీయ మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్ వొడాఫోన్‌పై పన్నుల భారం వల్ల భారతదేశం, నెదర్లాండ్స్ మధ్య ఒప్పంద ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నాయని తీర్పునిచ్చింది. ఈ మొత్తాన్ని వడ్డీ లేకుండా తిరిగి ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. కెయిర్న్ ఎనర్జీ వివాదంలోనూ భారత్ ఆస్తులపై ఫ్రెంచ్ కోర్టు జప్తు ఆదేశాలు ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News