Saturday, November 23, 2024

వివాదాస్పదంగా సుందరయ్య పార్కు ఎన్నికలు!

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్: నగరంలో పేరుగాంచిన బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్కు ఎన్నికలు ప్రతి ఏడాది వివాదస్పదంగా మారుతున్నాయి. రెండేళ్లుగా సుందరయ్య పార్కు వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ ఎన్నికలు అంతర్గత రాజకీయాలతో సాధారణ రాజకీయాలను తలదన్నుతున్నాయి. ముఖ్యంగా ఏడాదికోసారి జరుగుతున్న ఈ ఎన్నికలు వరుసగా రెండేళ్లు హోరా హోరీగా పోటీ ఉండటమే ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ ఏడాది ఎన్నికలు నిర్వహించకుండా ఏకగ్రీవం చేద్దామని క్లబ్ ముఖ్యులు భావించిన తరుణంలో మరోసారి వివాదస్పదంగా మారనున్నట్టు స్పష్టం అవుతున్నాయి. ఏకగ్రీవంగా అధ్యక్షుడిని ఎన్నుకోవడం మంచి సాంప్రదాయమే అయినప్పటికీ, ఈ ఏకగ్రీవం గుట్టు చప్పుడు కాకుండా, వాకర్స్ క్లబ్ కమిటీ కార్య వర్గ సభ్యులకు కూడా కనీసం సమాచారం లేకుండా, ముందస్తు నోటీస్ అంటించకుండానే, జనరల్ బాడీ సమావేశం అయినా నిర్వహించకపో వడం ప్రస్తుతం వివాదం అవుతోంది.

రహస్యంగా ఏకగ్రీవం…
సుందరయ్య పార్కు వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ ఎన్నికలు 2022 నుంచి ఏకగ్రీవం కాకుండా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు నిర్వ హించాలని భావించారు. ఈ క్రమంలో 2022 ఏడాదికి న్యాయవాది పాం డయ్య, వివేక్ పోటీ చేయగా పాండయ్య గెలుపొందారు. 2023లో సలిపెల రమేష్‌రెడ్డి, వివేక్ పోటీ చేయగా, రమేష్ రెడ్డి గెలుపొందారు. వరుస రెండేళ్లుగా వివేక్ ఓడిపోతున్న నేపథ్యంలో 2024 ఏడాదికి ఎలాంటి పోటీ లేకుండా వివేక్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుందామనే వాదన వాకర్స్ క్లబ్ ముఖ్యులు భావించారు. ఈ విషయంపై అతికొద్ది మందితో రహస్యంగా ఏర్పాటు చేసుకున్న ఓ పార్టీ లో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఒప్పందంలో ఎలాంటి లావాదేవీలు జరిగాయానే విష యాలు బయటకు పొక్కడం లేదు. వివేక్‌ను ఏక్రగీంగా ఎన్నుకున్నట్టుగా మినిట్స్ బుక్‌లో 5 గురి సంతకాలు చేసినట్టుగా తెలుస్తోంది.

ఈసి సభ్యులకు తెలియకుండా కళ్యాణ్ నాయక్, వాకర్స్ క్లబ్ ఉపాధ్యక్షుడు
సుందరయ్య పార్కు వాక ర్స్ క్లబ్ ఎన్నికలు ప్రతి ఏడాది జరిగినట్టే ప్రజాస్వామ్యబద్ద్ధంగా నిర్వహించాలి. రహస్యంగా మందు పార్టీలు ఏర్పాటు చేసుకుని నూతన కమిటీని ఎన్నుకోవడం మంచి సాంప్రదా యం కాదు. కనీసం నోటీస్ బోర్డులో సభ్యులకు సమాచా రం ఇవ్వలేదు. జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయలేదు. ఇదేం కాకున్నా.. కార్యవర్గ కమిటీ కూడా ఏర్పాటు చేయకపోవడం అప్రజాస్వామికం. ప్రభుత్వ ఉద్యోగి అయిన రూపుల వివేక్ ఎన్నికల్లో ఎలా పాల్గొంటాడు. వాకర్స్ క్లబ్ అంటే నలుగురే ఇష్టా రాజ్యంగా వ్యవహారించడం సరికాదు. కచ్చితంగా ప్రజాస్వామ్య స్ఫూర్తితో సుం దరయ్య పార్కు వాకర్స్ క్లబ్ ఎన్నికలు నిర్వహించాల్సిం దే. ఎన్నికలకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News