ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మరో ఆసక్తికర మ్యాచ్ బుధవారం జరిగింది . రాజస్ధాన్ రాయల్స్త్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేయగా.. రాజస్థాన్ 159 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే ఈ మ్యాచ్‌లో చిన్న వివాదం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో రియాన్ పరాగ్ ఔటైన విధానంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. జట్టుకు మంచి స్కోర్ అందించే క్రమంలో రియాన్ కుల్వత్ ఖేజ్రోలియా బౌలింగ్‌లో ఓ బంతి అతని బ్యాట్‌కి తగిలి కీపర్ చేతిలోకి వెళ్లిందని.. అంపైర్ దాన్ని ఔట్‌గా ప్రకటించాడు.
అయితే బంతి నేలకి తగిలిందని రియాన్ క్షణం ఆలోచించకుండా రివ్యూ తీసుకున్నాడు. కానీ థర్డ్ అంపైర్‌కూడా దాన్ని ఔట్‌గా ప్రకటించడంతో.. పరాగ్ ఫీల్డ్‌లో ఉన్న అంపైర్‌తో వాదనకు దిగాడు. అంపైర్ వాదన వినకుండా మైదానం వదిలి వెళ్లిపోవాలని సూచించాడు. దీంతో కోపంగానే మైదానం వీడాడు రియాన్. ప్రస్తుతం ఈ విషయంపై సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోంది. కొందరు అంపైర్ నిర్ణయాన్ని సమర్థించగా.. మరికొందరు మాత్రం రియాన్‌కు మద్దతు ఇస్తున్నారు.