Friday, November 22, 2024

నయనతార ‘అన్నపూరణి’ సినిమాపై వివాదాలు

- Advertisement -
- Advertisement -

భోపాల్ : నయనతార నటించిన అన్నపూరణి సినిమాపై వివాదాలు మరింత బిగిసుకుంటున్నాయి. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఈ సినిమా ఉందంటూ అనేక హిందూ సంఘాలు సినిమా బృందంపై ధ్వజమెత్తుతున్నారు. పోలీస్‌లకు కూడా ఫిర్యాదులు వెళ్తున్నాయి. ఇప్పటికే శివసేన మాజీ నేత రమేశ్ సోలంకి మహారాష్ట్ర పోలీస్‌లకు ఫిర్యాదు చేయగా, తాజాగా మధ్య ప్రదేశ్ లోని జబల్‌పూర్ లోనూ కేసు నమోదైంది. జబల్‌పూర్ హిందూ సేవ పరిషద్ సంస్థాపకులు, అధ్యక్షుడు అతుల్ జెస్వానీ ఈ కేసు వేశారు. అన్నపూరణి సినిమాలో ప్రధాన పాత్రధారి నయనతార, డైరెక్టర్ నీలేశ్ కృష్ణ, నిర్మాతలు జతిన్ సేథీ, ఆర్. రవీందర్‌తోపాటు నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్ మోనికా షెర్గిల్ పై జబల్‌పూర్ లోని ఒంటి పీఎస్‌లో కేసు నమోదైంది.

రాముడిని కించపర్చడంతోపాటు లవ్ జిహాద్‌ను ప్రోత్సహించేలా సినిమా ఉందని హిందూ సేవా పరిషత్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేశారు. గత ఏడాది డిసెంబర్ 1న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. తర్వాత 28 రోజుల్లోనే నెట్‌ఫ్లిక్స్‌లోనే స్ట్రీమింగ్‌కు వచ్చింది. థియేటర్‌లో పెద్దగా ఈ సినిమాను చూడక పోయినప్పటికీ, ఓటీటీలో దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో సినిమాను చూసిన పలు హిందూ సంఘాలు చిత్ర యూనిట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బజరంగ్‌దళ్, హిందూ ఐటీ సెల్ ముంబైలో ఇప్పటికే ఓ కేసు కూడా పెట్టారు. ఈ వివాదాలతో నెట్‌ఫ్లిక్స్ అప్రమత్తమైంది. తమ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి ఈ సినిమాను డిలీట్ చేసింది. ఈ చిత్రం ఇప్పుడు సింప్లీ సౌత్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News