Friday, November 22, 2024

డిజిటల్ రూల్స్‌పై సమ్మతి పత్రం ఏదీ ?

- Advertisement -
- Advertisement -

Controversy between the center and social media

సోషల్ మీడియాకు కేంద్రం చురక

న్యూఢిల్లీ : వాట్సాప్ కొత్త డిజిటల్ రూల్స్‌కు సంబంధించి కేంద్రానికి, సోషల్ మీడియాకు మధ్య వివాదం మరింత రాజుకుంది. తాము వెలువరించిన డిజిటల్ రూల్స్‌ను ఆమోదిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికలు వెంటనే తమకు సమ్మతి రిపోర్టు అందించాలని కేంద్ర సమాచార సాంకేతిక వ్యవహారాల (ఐటి) మంత్రిత్వశాఖ తాజాగా ఆదేశాలు వెలువరించింది. కొత్త నిబంధనలపై ఫేస్‌బుక్ ఆధ్వర్యపు వాట్సాప్ కంపెనీ కేంద్ర ప్రభుత్వంపై న్యాయస్థానంలోదావాకు దిగిన తరువాతి పరిణామంగా కేంద్రం ఇప్పుడు స్పందించింది. ఫిబ్రవరి 25వ తేదీన కేంద్ర ప్రభుత్వం డిజిటల్ మీడియాకు సంబంధించి కొత్త రూల్స్‌ను తీసుకువచ్చింది. దీనితో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ , ట్విట్టర్ వంటి పలు సోషల్ మీడియా వేదికలు పలు రకాల షరతులకు కట్టుబడి ఉండాల్సి ఉంటుంది.

చీఫ్ కంప్లెయిన్స్ ఆఫీసర్‌ను, నోడల్ కాంటాక్ట్ పర్సన్‌ను, స్థానిక సమస్యల పరిష్కార అధికారిని ఏర్పాటు చేయాలని ఇతరత్రా చర్యలు చేపట్టాలని, వివాదాస్పద అంశాల నియంత్రణ బాధ్యతకు సంస్థలు బాధ్యతలు తీసుకుని తీరాలని స్పష్టం చేశారు. అయితే నిబంధనలకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లిన అంశంతో సంబంధం లేకుండా ఇప్పుడు ఐటి మంత్రిత్వశాఖ వెంటనే తమ రూల్స్‌కు సంబంధించిన అమలు అనుమతి నివేదికలను అందించాలని ఆదేశించింది. అయితే ఈ ఆదేశాల గడువు ముగిసింది. తాము వెలువరించిన ఆదేశాలు సోషల్ మీడియాలు మూసుకోవల్సిందేనని చెప్పడానికి కాదని, ప్రభుత్వం వెలువరించిన ఆదేశాలకు కట్టుబడి ఉండాల్సిందే అనే అంశాన్ని వారికి తెలియచేయడానికే అని ఐటి మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News