Wednesday, January 22, 2025

యాదగిరిగుట్ట తాత్కాలిక మున్సిపల్ కార్యాలయంలో వివాదం

- Advertisement -
- Advertisement -

యాదాద్రి: తాత్కాలికంగా లాడ్జిలో ఏర్పాటు చేసిన యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయంలో వివాదం చోటుచేసుకుంది. మున్సిపల్ భవనం శిథిలావస్థకు చేరడంతో పక్కనే ఉన్న మున్సిపల్‌కు చెందిన ప్రస్తుతం లీజు నిర్వాహకులు లాడ్జి కొనసాగుతున్న భవనంలో తాత్కాలికంగా నాలుగు గదులను కేటాయించి మున్సిపల్ కార్యాలయాన్ని తరలించారు. మున్సిపల్ తాత్కాలిక కార్యాలయం ప్రారంభమై నాలుగు రోజులు కాకముందే వివాదం చోటుచేసుకుంది.

మున్సిపల్ కార్యాలయం, లాడ్జి రెండు కలిసి ఉండడంతో గురువారం రాత్రి తమకు ఇబ్బంది కలగొద్దని లాడ్జి నిర్వాహకులు ఎలాంటి అనుమతులు లేకుండానే కార్యాలయం, లాడ్జి మధ్య గోడను నిర్మించారు. శుక్రవారం కార్యాలయానికి వచ్చిన అధికారులు, సిబ్బంది గోడ నిర్మాణాన్ని చూసి షాక్ అయ్యారు. అక్రమంగా కట్టిన గోడను పాలకమండలి, అధికారులు కలిసి తొలగించే సమయంలో అధికారులు, సిబ్బంది, లాడ్జి నిర్వాహకుల మధ్య వాగ్వాదం జరిగింది. గోడను తొలగించిన సిబ్బంది లాడ్జిని పూర్తిగా ఖాళీ చేయాలని నిర్వాహకులకు ఆదేశించినట్టు మున్సిపల్ కమిషనర్, చైర్మన్, పాలకమండలి సభ్యులు తెలిపారు. లాడ్జి నిర్వాహకులు నెల రోజుల్లో ఖాళీ చేస్తామని తెలిపినట్టు మున్సిపల్ కమిషనర్, చైర్మన్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News