Sunday, December 22, 2024

ఛాంపియన్స్ ట్రోఫీపై సందిగ్ధం

- Advertisement -
- Advertisement -

పట్టువీడని భారత్, పాక్ క్రికెట్ బోర్డులు
రద్దు దిశగా ఐసిసి కీలక నిర్ణయం?

దుబాయ్: భద్రత కారణాల దృష్ట్యా పాకిస్థాన్‌కు ఎట్టిపరిస్థితిలో టీమిండియాను పంపే అవకాశమే లేదని భారత క్రికెట్ బోర్డు (బిసిసి) ఖరాకండిగా చెప్పడంతో ఛాంపియన్ ట్రోఫీని రద్దు చేయాలని ఐసిసి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇరుదేశాల క్రికెట్ బోర్డులు మొండికేయడంతో ఈ మెగా టోర్నీపై సందిగ్ధం నెలకొందని ఐసిసి పేర్కొంది. 2025 ఫిబ్రవరి 19 నుంచి వన్డే ఫార్మాట్‌లో ఛాంపియన్ ట్రోఫీ జరుగనుండగా సోమవారం(10 నవంబర్, 2025) నుంచి ఈ మెగాటోర్నీకి 100 రోజుల కౌంట్‌డౌన్ ప్రారంభం కావాలి.

అయితే ఈ కీలక ఈవెంట్‌కు మెగాటోర్నీలో పాల్గొనే 8 జట్ల జెండాలను ప్రదర్శించాలి. కానీ భారత ప్రభుత్వం భద్రతా కారణాల దృష్టా బిసిసిఐ అనుమతివ్వలేదు. ఇక, టీమిండియాను తమ దేశానికి తీసుకురావాలని పాకిస్థాన్ ఒత్తిడి చేయడంతో ఐసిసి ఛాంపియన్ ట్రోఫీని తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలుస్తోంది. 2008 నవంబర్‌లో ముంబయి ముష్కర దాడుల అనంతరం భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటించని విషయం తెలిసిందే. ద్వైపాక్షిక సిరీస్‌లతో పాటు ఆసియా కప్ వంటి టోర్నీల కోసం భారత్ తమ దేశానికి రావాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎన్నిసార్లు విన్నవించినా బిసిసిఐ ససేమిరా అంది.

ఇటీవల పాక్ ఆతిథ్యం ఇచ్చిన ఆసియా కప్‌కు హైబ్రిడ్ మోడల్‌లో శ్రీలంక వేదికగా భారత్ మ్యాచ్‌లు ఆడిన విషయం తెలిసిందే. అయితే ఇదే తరహాలో ఛాంపియన్స్ ట్రోఫీలో భారత మ్యాచ్‌లు కూడా ఇతర దేశాలకు తరలించాలని బిసిసిఐ ఐసిసిని కోరింది. భారత మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చేందుకు యుఎఇ, శ్రీలంక సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు 2023 వన్డే వరల్డ్ కప్ కోసం భారత్‌కు పాకిస్థాన్ వచ్చింది. అలానే టీమిండియా కూడా వస్తుందని అనుకుంది. కానీ బిసిసిఐ నో చెప్పింది. ఇది పాకిస్థాన్‌కు ఆర్థికంగా దెబ్బ మాత్రమే కాకుండా, ప్రపంచ వేదికపై తమ బోర్డుకు శక్తి లేదని తెలిసిపోతుందని పాకిస్థాన్ ఆలోచన.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News