Sunday, December 22, 2024

మహిళలకు ఆర్టీసీ బస్సులో టికెట్‌పై వివాదం

- Advertisement -
- Advertisement -

బోధన్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ స్కీముల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించింది. లాంఛనంగా శనివారం నుంచి ఈ సేవలను ప్రారంభించగా ఆదివారం ఓ వివాదం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే ..బోధన్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నిజామాబాద్ నుంచి బోధన్‌కు బయలు దేరింది. ఈ బస్సులో ప్రయాణిస్తున్న కొందరు మహిళలకు కండక్టర్ టికెట్లు తీసుకోవడం వివాదానికి కారణమైంది. నిజామాబాద్ నుంచి బోధన్ వస్తున్న బస్సులో మూడు టికెట్లను ఓ కుటుంబీకులు తీసుకున్నారు. అందులో ఒకరు వ్యక్తి కాగా ఇద్దరు మహిళలు ఉన్నారు. కొద్ది దూరం ప్రయాణించాక జాన్కంపేట్ చేరుకోగానే మహిళలు కండక్టర్ టికెట్‌కు డబ్బులు తీసుకోవడంపై నిలదీశారు. ఒక వ్యక్తి టికెట్ తీసుకోవడం వల్ల ముగ్గురు టికెట్లు ఇచ్చానని, పొరపాటు వల్ల మహిళలకు టికెట్లు ఇచ్చానని కండక్టర్ సర్ది చెప్పారు.

అయితే ఈ టికెట్లను ఇతరులకు ఇస్తానని చెప్పినప్పటికీ సదరు మహిళలు తమకు బిచ్చం వేస్తున్నారా అని కండక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాణం ఇస్తుంటే కండక్టర్ ఎలా టికెట్ కొడతారని.. డబ్బులు ఎలా తీసుకుంటారని మహిళలు నిలదీశారు. ఈ తరుణంలో ప్రయాణికులకు ఆర్టీసీ కండకర్‌కు మధ్య వివాదం నెలకొని ఘర్షణ వరకు దారితీసింది. ఈ విషయాన్ని మహిళలు ఆర్టీసీ ఎండి సజ్జనార్ దృష్టికి తీసుకొని వెళ్లారు. ట్విట్టర్లో సజనార్‌కు పోస్ట్ చేయడంతో స్పందించిన ఆయన వెంటనే ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. మహిళలకు టికెట్లు కొట్టిన కండక్టర్ నరసింహులు వ్యవహారంపై ఆర్టీసీ అధికారులు విచారణకు ఆదేశించారు. సదరు కండకర్‌ను డిపో స్పేర్‌లో ఉంచినట్లు బోధన్ డిపో మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News