Monday, December 23, 2024

భువనగిరి కోటాను టూరిజం హబ్‌గా మార్చితే అనేక మందికి ఉపాధి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి : జిల్లా కేంద్రంలోని భువనగిరి కోటను టూరిజం హబ్గా మార్చితే అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా టూరిజం శాఖ యాదాద్రి భువనగిరి ఏర్పాటు చేసిన సమావేశంలో భువనగిరికి పూర్వ వైభవంలో భాగంగా గురువారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఇందులో డీపీఆర్ తయారు చేయడానికి వచ్చిన సిబ్బంది గంగాధరం టీం లీడర్ ట్రబుల్ ముఖర్జీ, మార్కెటింగ్ ఎక్స్ పర్ట్ ఎం సుమతి, పీఎం అండ్ యుపీ శివకుమార్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్రీధర్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను ప్రదర్శించారు. అనంతరం భువనగిరి ఫోర్ట్ కు సంబంధించి మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి అవసరమైన సలహాలను జిల్లా కలెక్టర్ నుండి సేకరించారు. మాస్టర్ ప్లాన్ ఎలా ఉండాలనే అంశాలు, హాస్పిటాలిటి ఫెసిలిటీస్, పార్క్, రోడ్లు, లైటింగ్ సిస్టం, ఇంకా అవసరమైన ఏర్పాట్లపైన సుదీర్ఘంగా సమావేశంలో చర్చించారు.

ఈసందర్భంగా కలెక్టర్ పమేలా సత్పత్తి మాట్లాడుతూ ముఖ్యంగా యోగా, మెడిటేషన్ ఉండేందుకు భువనగిరి పోర్టు చుట్టూ ఆర్ రోడ్ కనెక్టివిటీ గురించి అవసరం ఉన్నంత పార్కింగ్ ఉండాలని సూచించారు. రాక్ క్లైమ్బింగ్ ఇన్ ఇన్స్టిట్యూట్ కు సంబంధించి తగు సూచనలు చేశారు. భువనగిరి పోర్టు టూరిజం హబ్ గా తయారైతే స్థానికంగా ఉన్న ఎంతోమందికి ఉపాధి కలుగుతుందని తెలిపారు. అంతేకాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి నాగిరెడ్డి ,జిల్లా టూరిజం అధికారి కే ధనంజనేయులు , మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి ,మౌంటినీరు అన్విత రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News