Thursday, January 23, 2025

మినీ అంగన్‌వాడీలను మెయిన్ అంగన్‌వాడీలుగా చేయడం హర్షనీయం: ఆడెపు వరలక్ష్మి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రం ప్రభుత్వం మినీ అంగన్‌వాడీ టీచర్లను ఎలాంటి షరతులు లేకుండా మెయిన్ అంగన్‌వాడీలుగా అప్‌గ్రేడ్ చేసినందుకు తెలంగాణ రాష్ట్ర మినీ అంగన్‌వాడీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆ సంఘం నాయకులు సిఎం కెసిఆర్‌కు పాలాబిషేకం చేసి బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్‌ రెడ్డితో కలిసి కేక్ కట్ చేయించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎలాంటి ధర్నాలు,రాస్తారోకోలు చేయకుండా ప్రభుత్వానికి సామరస్యంగా మా విన్నపాలను వినతి పత్రాలు ఇవ్వడంతో తమకు న్యాయం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు.

సిబ్బంది సమస్యలు అర్థం చేసుకునే ప్రభుత్వం ఉంటే ఎలాంటి సమ్మెలు, ధర్నాలు అవసరం లేదని నేడు మినీ అంగన్‌వాడీ టీచర్లు నిరూపించినట్లు పేర్కొన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ చేతుల మీదుగా కేంద్రం అప్‌గ్రేడ్ చేసిన జీఓ ను తీసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న సిఎం కెసిఆర్‌కు మినీ అంగన్వాడీ టీచర్లు రుణపడి ఉంటారని వెల్లడించారు. మాకు సహాయ సహకారాలు అందిస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి సత్యవతి రాథోడ్, మంత్రి కెటిఆర్, హారీష్‌రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్‌కు ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోయినా రాష్ట్ర ప్రభుత్వం మాకు న్యాయం చేసి 3989 మంది మినీ అంగన్వాడీ టీచర్ల కుటుంబాలు తెలంగాణ ప్రభుత్వం చేసిన మేలు ఎప్పటికి మరువలేమన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News