Monday, December 23, 2024

మహిళపై హత్యాచారం కేసులో దోషికి మరణశిక్ష

- Advertisement -
- Advertisement -

Convict sentenced to death in murder case against woman

ముంబై: నగర శివార్లలోని సకినాకలో గత ఏడాది సెప్టెంబర్‌లో ఒక 34 ఏళ్ల మహిళపై అత్యాచారం జరిపి, అత్యంత దారుణంగా హతమార్చిన దోషికి ముంబై సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది. ఈ దారుణ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించి ప్రజలలో తీవ్ర ఆందోళనకు దారితీయగా సత్వర న్యాయం ఇప్పిస్తానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే హామీ ఇవ్వడంతోపాటు మూడు వారాల్లోగానే ముంబై పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో దోషి మోహన్ కత్వారు చౌహాన్‌కు ముంబైలోని సెషన్స్ కోర్టు గురువారం మరణశిక్ష విధించింది. నిలిపిఉన్న ఒక టెంపోలో 34 ఏళ్ల మహిళను అత్యంత అమానుషంగా అత్యాచారం చేసి ఆమెను చిత్రహింసలు పెట్టి హతమార్చినట్లు చౌహాన్‌పై ఆరోపణలు కోర్టులో నిరూపితమయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News