Monday, December 23, 2024

యజమాని కుటుంబాన్ని అంతం చేసిన వంట మనిషి

- Advertisement -
- Advertisement -

 

రాంచీ: భోజనం విషయంలో గొడవ జరగడంతో యజమాని కుటుంబంలో ఇద్దరిని వంట మనిషి గొడ్డలితో నరికి చంపిన సంఘటన ఝార్ఖండ్ రాష్ట్రంలో గుమ్లా జిల్లాలో చోటుచేసనుకుంది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రిచర్డ్, మెలేనీ మింజ్ దంపతుల ఇంట్లో సత్యేంద్ర లక్రా అనే వంటమనిషి కొన్ని సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. భోజనం విషయంలో రిచర్డ్‌కు సత్యేంద్రకు ఘర్షణ చోటుచేసుకోవడంతో వంటి మనిషిపై యజమాని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అలా పలుమార్లు జరగడంతో యజమానిని హత్య చేయాలని వంట మనిషి నిర్ణయం తీసుకున్నాడు. గొడ్డలితో యజమాని ఇంటికెళ్లి దంపతులను నరికేశాడు. అనంతరం పిల్లలపై దాడి చేస్తుండగా బాలుడు తప్పించుకున్నాడు. కానీ బాలిక తీవ్రంగా గాయపడింది. వెంటనే ఘటనా స్థలం నుంచి సత్యేంద్ర తప్పించుకున్నాడు. స్థానికులు బాలికను ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకొని పోలీసులు ప్రశ్నించారు. యజమాని తనని పలుమార్లు చంపుతానని బెదిరించడంతో తానే హత్య చేశానని పోలీసులు ఎదుట ఒప్పుకున్నాడు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News