Wednesday, January 22, 2025

రూ. 450కే వంట గ్యాస్, పెట్రోల్ ధర తగ్గింపు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు ఓట్లు వేయడంతో సాధారణ ఎన్నికల్లోనూ హామీలు గుప్పించేందుకు కాంగ్రెస్ రెడీ అయిపోయింది. మరికాసేపట్లో ఎఐసిసి కార్యాలయంలో మల్లికార్జున్ ఖర్గే, సోనియా  గాంధీ, రాహుల్ గాంధీ విడుదల చేయనున్న మేనిఫెస్టోలో అనేక ఆకర్షణీయమైన హామీలు ఉన్నట్లు తెలుస్తోంది. తన మేనిఫెస్టోకు పాంచ్ న్యాయ్—పచ్చీస్ గ్యారంటీ అనే పేరు పెట్టిన సంగతి తెలిసిందే.

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన కొన్ని హామీలు:

సైన్యంలో అగ్నివీర్ పథకం రద్దు.. పాత రిక్రూట్ మెంట్ విధానాన్నే ప్రవేశపెడతాం

రూ. 450కే వంట గ్యాస్ సిలిండర్

రిజర్వేషన్లపై ప్రస్తుతం ఉన్న 50 శాతం పరిమితి తొలగింపు

రైతులకు కనీస మద్దతు ధరపై హామీ

విద్యారుణాలపై వడ్డీ రేటు తగ్గింపు

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు

30 లక్షల ఉద్యోగ నియామకాలు

మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం

గృహలక్ష్మి పథకం ద్వారా మహిళల ఖాతాల్లో నగదు జమ

వ్యవసాయ పరికరాలకు జీఎస్టీనుంచి మినహాయింపు

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News