Friday, December 20, 2024

విద్యుదాఘాతంతో వంట గ్యాస్ పేలి ఇళ్లు దగ్ధం

- Advertisement -
- Advertisement -
  • ఇంట్లో ఎవరు లేకపోవడంతో తప్పిన పెనుప్రమాదం

మనోహరాబాద్: విద్యుదాఘాతంతో ఇంట్లో మంటలు చెలరేగి వంట గ్యాస్ పేలి ఇళ్ళు పూర్తిగా దగ్ధమైన ఘటన బుధవారం కొండాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… జిల్లాలోని మనోహరాబాద్ మండలంలోని కొండాపూర్ గ్రామంలోని జల్లి పోచయ్య, లక్ష్మిలు ఉదయం తన ఇద్దరు పిల్లల్ని స్కూల్‌కు పంపించి భార్యాభర్తలు ఇద్దరు పనికి వెళ్లిన తర్వాత సుమారు ఉదయం 10.30 గంటలకు విద్యుదాఘాతంతో ఇంట్లో మంటలు చెలరేగి గ్యాస్ పేలీ ఇళ్లు మొత్తం పూర్తిగా దగ్ధమైంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఎలాంటి ప్రాణహాని కలుగలేదు. చుట్టుపక్కల వారు చూసి నర్సాపూర్ అగ్నిమాపక అధికారులకు తెలిజేయగా సమయానికి రాకపోవడంతో నీటితో ఇంటిపై చల్లి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఫైర్ ఇంజన్ రావడంతో మంటలను పూర్తిగా ఆర్పివేశారు. కాగా అప్పటికే ఇళ్లు పూర్తిగా దగ్ధమైనట్లు గ్రామస్తులు తెలిపారు. ఇంట్లో నగదుతో పాటు 2 లక్షల విలువైన బంగారం, రెండు ప్లాట్ల సర్టిఫికెట్లు, విలువైన డాక్యుమెంట్లతో పాటు సామాగ్రి పూర్తిగా దగ్ధమైనట్లు బాధితులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News