Saturday, November 23, 2024

వంట నూనె దిగుమతులు 34% పెరిగాయ్

- Advertisement -
- Advertisement -

 

నవంబర్‌లో 15.29 లక్షల టన్నుల దిగుమతులు: ఎస్‌ఇఎ నివేదిక
న్యూఢిల్లీ : నవంబర్‌లో భారతదేశం వంట నూనెల(ఎడిబుల్ ఆయిల్) దిగుమతి 34 శాతం పెరిగి 15.29 లక్షల టన్నులకు చేరుకుంది. క్రూడ్ పామ్, రిఫైన్డ్ పామాయిల్ దిగుమతులు భారీగా ఉండడం వల్ల ఈ పెరుగుదల నమోదైంది. అదే సమయంలో కూరగాయల నూనె 32 శాతం పెరిగి 15.45 లక్షల టన్నులకు చేరుకోగా, ఇది గతేడాది ఈ నెలలో 11.73 లక్షల టన్నులుగా ఉంది. 2022-23 సంవత్సరానికి గాను వంట నూనె, నాన్-ఎడిబుల్ ఆయిల్‌తో సహా మొత్తం కూరగాయల నూనెల దిగుమతి డేటాను సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఇఎ) విడుదల చేసింది.

ఈ డేటా ప్రకారం, ఈ ఏడాది నవంబర్‌లో ఎడిబుల్ ఆయిల్‌ల రవాణా 15,28,760 టన్నులకు పెరగ్గా, ఇది 2021 అదే నెలలో 11.39 లక్షల టన్నులుగా ఉంది. నవంబర్ నెలలో వంట నూనె దిగుమతి 34,924 టన్నుల నుండి 52 శాతం తగ్గి 16,780 టన్నులకు పడిపోయింది. క్రూడ్ పామాయిల్ రికార్డు పెరిగింది. నవంబర్‌లో భారత్ రికార్డు స్థాయిలో 9.31 లక్షల టన్నుల పామాయిల్‌ను దిగుమతి చేసుకోగా, గతేడాది ఇదే నెలలో 4.7 లక్షల టన్నులుగా ఉంది. అంతకుముందు 2015 అక్టోబర్‌లో అత్యధికంగా 8.7 లక్షల టన్నుల ముడి పామాయిల్‌ను భారత్ దిగుమతి చేసుకుంది.

శుద్ధి చేసిన పామోలిన్ దిగుమతి గురించి మాట్లాడితే, నవంబర్‌లో 2.02 టన్నులకు పెరిగింది, ఇది గతేడాది ఇదే నెలలో 58,267 టన్నులుగా ఉంది. సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి కూడా లక్షా 25 వేల టన్నుల నుంచి 1.57 లక్షల టన్నులకు పెరిగింది. అదే సమయంలో ముడి సోయాబీన్ నూనె రవాణా నవంబర్ 2021లో 4,74,160 టన్నుల నుండి గత నెలలో 2,29,373కి తగ్గింది. దేశీయ రిఫైనర్లపై ప్రభావం చూపుతున్నందున శుద్ధి చేసిన పామోలిన్‌ను అధికంగా దిగుమతి చేసుకోవడంపై ఎస్‌ఇఎ ఆందోళన వ్యక్తం చేసింది.

ముడి పామాయిల్‌పై దిగుమతి సుంకం 5 శాతం, శుద్ధి చేసిన ఆయిల్‌పై 12.5 శాతం విధిస్తున్నట్లు అసోసియేషన్ తెలిపింది. భారతదేశంలోకి శుద్ధి చేసిన పామోలిన్ దిగుమతిని ఆపడానికి ఇంత తక్కువ సుంకం సరిపోదు. దీంతో ఇతర దేశాలు లాభపడుతుండడంతో దేశీయ మార్కెట్లపై ప్రభావం పడుతోంది. మలేషియా, ఇండోనేషియా వంటి దేశాలు దీని వల్ల లబ్ధి పొందుతున్నాయి. శుద్ధి చేసిన పామోలిన్‌పై దిగుమతి సుంకాన్ని 12.5 శాతం నుండి 20 శాతానికి పెంచాలని, అలాగే సిపిఒ, ఆర్‌బిడి పామోలిన్ మధ్య 15 శాతం సుంకం వ్యత్యాసాన్ని అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్ నుంచి భారత్ పామాయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది. సోయాబీన్ నూనె అర్జెంటీనా, బ్రెజిల్ నుండి వస్తుంది. అయితే సన్‌ఫ్లవర్ ఆయిల్ ఉక్రెయిన్, రష్యా నుండి వస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News