- Advertisement -
హైదరాబాద్: సామాన్యులకు షాక్.. నిత్యవసర ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇటీవల కూరగాయాల ధరలు పెరిగగా.. తాజాగా వంట నూనెల ధరుల కూడా పెరిగాయి. దీంతో సామాన్య ప్రజలకు నిత్యవసర వస్తులు భారంగా మారాయి. వంటనూనెల ధరలు భారీగా పెరిగాయి.
గత నెలలో లీటర్ పామాయిల్ దర రూ.100గా ఉుండగా.. ఇప్పుడు రూ.137కి చేరింది. ఇక, సోయాబీన్ రూ.120 నుంచి రూ.148, సన్‌ఫ్లవర్ రూ.120 నుంచి రూ.149, ఆవ నూనె రూ.140 నుంచి రూ.181, వేరుశనగ నూనె రూ.180 నుంచి రూ.184కి పెరిగాయి. దేశీయంగా నూనె గింజల సాగు పెద్దగా లేకపోవడం, దిగుమతులపై సుంకాల పెంచడంతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. కొత్త పంట వచ్చే వరకూ ధరలు దిగిరావని.. ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు.
- Advertisement -