తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కూలీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను సృష్టించింది. ఈ సినిమాను దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. తాజాగా ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం స్టార్ బ్యూటీని తీసుకోబోతున్నారనే టాక్ కోలీవుడ్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. కూలీ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌ను లోకేశ్ కనగరాజ్ పెట్టబోతున్నాడని..
ఈ సాంగ్‌లో అందాల బుట్టబొమ్మ పూజా హెగ్డే తనదైన డ్యాన్స్ స్టెప్పులతో అదరగొట్టనుందనే టాక్ తమిళ మీడియా వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, చౌబిన్ సాహీర్, శృతి హాసన్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. ఇక ఇప్పుడు పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ కూడా ఉండనుండటంతో ఈ మూవీపై అంచనాలు తారాస్థాయికి చేరడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. మరి ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందనే క్లారిటీ రావాల్సి ఉంది.