- Advertisement -
కేంద్ర కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ : ప్రభుత్వ ఇ మార్కెట్‌ప్లేస్ (జిఇఎం)ను విస్తరించి దీని పరిధిలో సహకార సంఘాల సేకరణలకు అనుమతించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ బుధవారం నాటి సమావేశంలో ఆమోదం తెలిపింది. ఇప్పటివరకూ జిఇఎంల పరిధిలోకి కో ఆపరేటివ్‌లు రాలేదు. దీనితో సహకార సంఘాలు కొనుగోలుదార్లుగా జిఇఎం గుర్తింపు పొందలేదు. దీనిని పరిశీలించి ఇప్పుడు కో ఆపరేటివ్స్‌ను జిఇఎం పరిధిలోకి తీసుకురావాలనే నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న 8.54 లక్షల కో ఆపరేటివ్స్ వీటిలోని 27 కోట్ల మంది సభ్యులు జిఇఎం పోర్టల్ నుంచి సరైన ధరలకు ఉత్పత్తులను పొందేందుకు వీలేర్పడుతుందని కేబినెట్ భేటీ తరువాత విషయాన్ని కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ విలేకరులకు తెలిపారు. ప్రధాని మోడీ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది.
- Advertisement -