Saturday, December 21, 2024

పోలీస్ స్టేషన్‌లో దళితుడిపై దాడి.. ఎస్ఐపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

ప్రయాగ్‌రాజ్ (యూపీ): ఓ కేసుకు సంబంధించి పోలీసు స్టేషన్‌లో దళిత వ్యక్తిని కొట్టినందుకు ఉత్తరప్రదేశ్ జిల్లాలో పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్‌పై కేసు నమోదు చేసినట్లు అధికారులు సోమవారం తెలిపారు. రామశంకర్ త్రిపాఠి అనే వ్యక్తి తన 18 ఏళ్ల కూతురు కనిపించకుండా పోయిందని ఈ నెల 19న సోరాన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సునీల్‌కుమార్‌ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (సోరాన్‌) శైలేంద్ర పరిహార్‌ తెలిపారు.

విచారణలో భాగంగా, బాలిక కాల్ వివరాల రికార్డులను తీసుకుని పరిశీలించి, ధర్మేంద్ర కుమార్ అనే వ్యక్తిని శనివారం విచారణ కోసం పోలీసు స్టేషన్‌కు పిలిచారు. ఆదివారం కుమార్ పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేర్పించారు. కుటుంబ సభ్యుల డిమాండ్ మేరకు వైద్య పరీక్షలు నిర్వహించామని పరిహార్ తెలిపారు. ప్రస్తుతం కోలుకుంటున్న ధర్మేంద్రపై దాడి జరిగినట్లు వైద్య నివేదికలో తెలిపారు. దీంతో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సునీల్‌కుమార్‌పై కేసు నమోదు చేసినట్లు పరిహార్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News